హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటానన్న అభిమాని.. మరి ఆమె ఏమందో తెలుసా?

A fan marriage proposal for Tisca Chopra

12:29 PM ON 17th October, 2016 By Mirchi Vilas

A fan marriage proposal for Tisca Chopra

గతంలో అయితే అభిమాన హీరోయిన్లు అవుట్ డోర్ షూటింగ్లకో, మరోదానికో బయటకొస్తే అభిమానులు వెంటపడేవారు. ఫోటోలు దిగడం, ఆటోబయోగ్రాఫ్ లు అడగడం సరేసరి. అయితే ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియా వాడకం పెరిగాక సినిమా స్టార్లు అభిమానులతో మరింత మమేకమవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుటుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి అభిమానుల నుంచి ఊహించని కామెంట్లు కూడా వస్తుంటాయి. బాలీవుడ్ అందాల భామ టిస్కా చోప్రాకు కూడా ఓ అభిమాని నుంచి సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ట్విట్టర్ లో అమ్మడి ఫోటోలను చూసి రాహుల్ అనే అభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.

అయితే 42 ఏళ్ల టిస్కాకు సంజయ్ చోప్రా భర్తగా ఉన్నాడనే విషయం తెలీక ఆ అభిమాని ఈ పనిచేశాడో లేక కావాలనే ట్వీట్ పెట్టాడో గానీ... అతడి ప్రపోజల్ పై అమ్మడు మాత్రం కాస్త కొంటెగా స్పందించింది. మా ఆయన ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. మీ పూర్తి వివరాలు పంపించండి. నేను ఎవరితో ఉండాలనుకుంటున్నానో అతణ్ని మా ఆయన కూడా చూడాలనుకుంటున్నారు. అని సమాధానమిచ్చింది. ఇంతకీ పైలెట్ అయిన సంజయ్ చోప్రాను పెళ్లి చేసుకున్న టిస్కాకు ఓ పాప కూడా ఉంది. చట్నీ అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో ప్రస్తుతం టిస్కా బిజీగా ఉంది.

English summary

A fan marriage proposal for Tisca Chopra