అభిమాని చేసిన తప్పుకి షారుఖ్ పై నింద! 

A fan of Sharukh Khan made sandals with deer skin

05:45 PM ON 27th August, 2016 By Mirchi Vilas

A fan of Sharukh Khan made sandals with deer skin

అభిమానులు చేసే పనులు హీరోలకు ఒక్కోసారి తలవంపు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి వివాదాస్పదం అయ్యాడు. అందుకు అభిమాని కారణం. దీంతో షారుఖ్ అంతర్జాతీయ వార్తల్లోకెక్కాడు. పాకిస్థాన్ దేశంలోని పెషావర్‌ కు చెందిన ఓ షూ మేకర్ షారూఖ్ ఖాన్ కోసం జింకచర్మంతో పెషావర్ శాండిల్స్(చెప్పులు) కుట్టాడట. జింకచర్మంతో చెప్పులు కుట్టిన షూ మేకర్‌ ను పెషావర్ పోలీసులు జైలుకు పంపించారు. షారూఖ్ దగ్గరి బంధువు అయిన ఓ వ్యక్తి షూ మేకర్ అయిన జహంగీర్ ఖాన్ వద్దకు వెళ్లి షారూఖ్ కోసం రెండు జతల చెప్పులు కుట్టివ్వాలని కోరాడు. షారూఖ్ అభిమాని అయిన జహంగీర్ ఖాన్ తన అభిమాన నటుడికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకొని జింకచర్మం తెచ్చి చెప్పులు కుట్టాడని స్థానిక పెషావర్ పోలీసులు చెప్పారు.

ఈ విషయం తెలిసి పాకిస్థాన్ వన్యప్రాణి విభాగం అధికారులు కేసు నమోదు చేసి జహంగీర్‌ ను జైల్లో పెట్టేసారు. షారూఖ్ చెప్పుల తయారీకి జహంగీర్ జింక చర్మం వాడాడా లేదా అనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని వన్యప్రాణి విభాగం అధికారులు అంటున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న నేటి తరుణంలో జింక చర్మంతో తనకు చెప్పులు కుట్టడంపై షారూఖ్ ఎలా స్పందిస్తాడో చూడాలని అంటున్నారు. నెటిజన్లు మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తప్పని అంటే, మరికొందరు ఎవరో ఏదో చేస్తే బాద్ షాను తప్పు పట్టడం ఏమిటని వాదిస్తున్నారట.

ఇది కూడా చదవండి: ఐశ్వర్యకు ఐక్య రాజ్య సమితి అరుదైన గౌరవం

ఇది కూడా చదవండి: ఇంతకీ వీళ్లల్లో 'సావిత్రి' ఎవరు?

ఇది కూడా చదవండి: 'బ్రహ్మోత్సవం' అక్కడ 100 రోజులు ఆడిందట!

English summary

A fan of Sharukh Khan made sandals with deer skin