8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

A fan sends 8 thousand roses to Sonal Chauhan

09:34 AM ON 16th May, 2016 By Mirchi Vilas

A fan sends 8 thousand roses to Sonal Chauhan

అందాల తారలను అభిమానులు తెగ ప్రేమిస్తారు. అఫ్ కోర్స్.. తమ ఇష్టాన్నే కొందరు ప్రేమ అనుకుంటారు. మరికొంతమందైతే తమ లవ్ ని చెప్పాలనుకుంటారు. ఇదంతా పక్కన పెడితే, తమ అభిమానం, ప్రేమ, ఇష్టాన్ని అసలు భామకు అతి కొద్ది మంది మాత్రమే చేరవేయగలుగుతారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కి సరిగా అలాంటి ఫ్యాన్ తగులుకున్నాడు. డిక్టేటర్, లెజెండ్ చిత్రాల్లో బాలయ్యతో ఆడిపాడిన ఈ సుందరాంగి ప్రస్తుతం బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. గత వారానికి పైగా ముంబైలోని వెర్సెవా ప్రాంతంలో ఉన్న సోనాల్ చౌహాన్ ఇంటికి.. రోజూ వెయ్యికి పైగా గులాబీలు వస్తున్నాయి.

పలు రకాల గులాబీ పూలు, బొకేలు ఇంటికి చేరుతున్నాయి. ఓ రహస్య ప్రేమికుడు వీటిని నేరుగా సోనాల్ ఇంటికి పంపుతున్నాడు. ఇప్పటికి 8 వేలకు పైగా గులాబీలు అమ్మడి ఇంటికి చేరగా.. వాటిలో చాలావరకు ఓపిగ్గా ఇల్లంతా సోనాల్ చౌహాన్ స్వయంగా అలంకరించిందిట. పంపే వ్యక్తి ఎవరో తెలీకపోయినా.. ఈ గులాబీ పూల కాన్సెప్ట్ అమ్మడికి బాగా నచ్చిందని టాక్.... అయితే.. ఈ గులాబీ లవర్ ఎవరో మాత్రం ఇంకా డీటైల్స్ తెలీలేదు. కానీ అమ్మడు ఇంట్రెస్ట్ గా అలంకరించడం చూస్తే.. ఆ సీక్రెట్ లవర్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే అనుకుంటున్నారు దగ్గరి వాళ్లు.

English summary

A fan sends 8 thousand roses to Sonal Chauhan. A fan send 8 thousand roses to Sonal Chauhan house with love.