ఛీఛీ... కన్నకూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి.. ఆపై..

A father makes a daughter his pregnant in Odissa

10:54 AM ON 21st October, 2016 By Mirchi Vilas

A father makes a daughter his pregnant in Odissa

వావి వరసలు మంటగలసిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఏం చేస్తారో వింటున్నాం... కానీ కన్నకూతురిని కూడా వదలని కామ పిశాచులు ఈమధ్య పేట్రేగిపోతున్నారు. తాజాగా కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రిని పహాడిషరీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ చలపతి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం కుటుంబంతో నగరానికి వచ్చి ఓ కాలనీలో నివసిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.

భార్యాభర్తలిద్దరూ.. కుమార్తెసహా ఓ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్నారు. అతడు ఏడాది నుంచి కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసినా బయట పెట్టలేదు. ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తానని బెదిరిస్తున్నాడు. బాలిక గర్భం దాల్చటంతో గుర్తించిన ఇంటి యజమాని, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా... నేరాన్ని అంగీకరించాడు. గురువారం అతడిని రిమాండ్ కు తరలించారు.

English summary

A father makes a daughter his pregnant in Odissa