కొడుకును వెయ్యికి అమ్మేసాడు.. ఎందుకో తెలుసా?

A father sold his son for 1000 rupees

11:21 AM ON 5th July, 2016 By Mirchi Vilas

A father sold his son for 1000 rupees

ఒకప్పుడు గోదావరి తీరాన పంటలు పండక, కరువు నృత్యం చేస్తుంటే, తమ బిడ్డలను అర్ధ రూపాయికి అమ్మేసేవారట. అదిచూసి చలించిన కాటన్ దొర గోదావరి పై ఆనకట్ట కట్టాడు. మరి ఇప్పుడు పిల్లలను అమ్మేసే పరిస్థితి చాలా చోట్ల ఉందట. ఎందుకంటే, ప్రపంచంలో ఆకలి చావుల తీవ్రత ఎలా ఉందో? మనకు రాత్రి భోజనం దొరుకుతుందంటే అది అదృష్టమేనే అనుకోవాలి. సుమారు 20 కోట్ల మంది భారతీయులు రాత్రి ఏమీ తినకుండనే పడుకుంటున్నారు. అంతే కాదు మరో షాకింగ్ నిజం.. రోజుకు 7000 మంది ఆకలితో చనిపోతున్నారు. ఆకలి మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుందని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.

జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక గిరిజన తెగకు చెందిన వ్యక్తి తన కొడుకును కేవలం రూ 1000కే అమ్ముకున్నసంఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. తన మిగతా కుటుంబానికి ఆహారం అందించడానికి అతడు ఇలా చేసాడట..! జార్ఖండ్ రాష్ట్రంలోని దొహ్లాబేడా పంచాయితీలోని బరునియా గ్రామానికి చెందిన బోతా సబర్ అనే వ్యక్తికి మొత్తం ఆరుగురు సంతానం. అతను ఈ మధ్యనే తన భార్యను కోల్పోయాడు. దీంతో మొత్తం కుటుంబం భారం తన మీదే పడింది. దీనికి తోడు అతనికి ఈ మధ్యనే గాయమయింది. దీంతో కుటుంబ పోషణ అతనికి కష్టమయింది. దీంతో పేదరికంలో మగ్గుతున్న ఈ వ్యక్తి తన కొడుకును కేవలం రూ 1000కు అమ్మేసాడు.

అయితే ఆ ఊరి పెద్ద ఆ గ్రామానికి చెందిన అభివృద్ధి అధికారిని కలిసి బోతాకు సాయమందించాలని చెప్పాడు. అయితే ఇది జరిగే ముందు బోతా తన కొడుకును అమ్మేసాడు. సబర్ జాతికి చెందిన గిరిజనులు మొత్తం ఐదు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. అందులో జార్ఖాండ్ రాష్ట్రం ఒకటి. సబర్ అనేది అంతరించిపోతున్న గిరిజన జాతి. ప్రస్తుతం బోతా తన కొడుకు కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడట. అది దుస్థితి.

English summary

A father sold his son for 1000 rupees