కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

A father takes revenge on a rapist

06:29 PM ON 20th April, 2016 By Mirchi Vilas

A father takes revenge on a rapist

ఓ తండ్రి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తన కూతురు పై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కాళ్లు విరిచి, చేతులు నరికేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని బాటిండాకు సమీపంలోని కోట్లిఅల్బూ గ్రామంలో గతేడాది ఏప్రిల్ లో ఎనిమిది నెలల చిన్నారి పై పర్మీందర్ సింగ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. అయితే మంగళవారం చిన్నారి తండ్రి పమ్మా సింగ్, యువకుడు పర్మీందర్ సింగ్ విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వస్తుండగా కేసును రాజీ కుదుర్చుకుందామని పర్మీందర్ ను పమ్మా సింగ్ పిలిచాడు.

మార్గం మధ్యలోనే పర్మీందర్ ను చెట్టుకు కట్టేసి రెండు చేతులు నరికివేశాడు. తీవ్ర గాయాలపాలైన పర్మీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English summary

A father takes revenge on a rapist. A 17 years boy raped a 8 months girl in Punjab. For that, that 8 months baby father takes revenge on that boy.