మ్యాచ్ లో కొట్టుకున్న ఆటగాళ్ళు.. ఇంతలోనే విషాదం!

A foot ball player died in match

10:23 AM ON 25th May, 2016 By Mirchi Vilas

A foot ball player died in match

అవును మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్ళు కొట్టుకున్నారు.. అయితే ఇది క్రికెట్ మ్యాచ్ లో కాదు ఫుట్ బాల్ మ్యాచ్ లో.. వివరాల్లోకి వెళితే.. ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఆటగాళ్లు ఊపిరి అందక, ఒత్తిడి తట్టుకోలేక మరణించడం సాధారణంగా జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా అర్జెంటీనాలో క్లబ్ స్థాయిలో జరుగుతున్న మ్యాచ్ లో బంతి కోసం పోటీపడుతూ ఇద్దరు ఆటగాళ్లు పరుగెత్తారు. బంతిని అందుకునే క్రమంలో ఒక ఆటగాడి కాలికి మరో ఆటగాడు కాలు తగలడంతో అతను కిందపడ్డాడు. రెండో ఆటగాడు బంతిని అందుకునే క్రమంలో నియంత్రించుకోలేక అతని తలను బలంగా షూతో తన్నేశాడు.

దీంతో ఇద్దరూ లేచి వాదించుకునే క్రమంలో మరో ఆటగాడు వచ్చి, బాధిత ఆటగాడిని బలంగా తోసేశాడు. అప్పటికే తలకు బలమైన దెబ్బతిని ఉన్న ఆటగాడు, అలా తోయడంతో కిందపడి మళ్లీ లేవలేదు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు. దీంతో ఫుట్ బాల్ క్రీడాకారుల్లో విషాదం చోటుచేసుకుంది.

English summary

A foot ball player died in match