దంపతుల మధ్య చిచ్చు రేపిన ఫన్నీ వీడియో

A funny video gets fire between husband and wife

01:23 PM ON 19th September, 2016 By Mirchi Vilas

A funny video gets fire between husband and wife

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా భర్త ఒకందుకు ఫన్నీ వీడియో తయారుచేస్తే, అది భార్యకు ఆగ్రహం కల్గించింది. దంపతుల మధ్య చిచ్చు రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు వూడీ(43), గతంలో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేసేవాడు. ఇప్పుడో యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు. శనివారం స్నేహితులతో కలిసి డిజిటల్ వీడియో ఫైల్(పోడ్కాస్ట్) తయారుచేసే పనిలో ఉన్నాడు. ఇది యూట్యూబ్ లోనే చాలా పెద్దది అవుతుందని వారితో పేర్కొన్నాడు. ఆ ఫన్నీ క్లిప్ లో ఆయన మాట్లాడుతూ తన భార్య చేసే చిల్లీ కాన్ కార్న్ ఎందుకు నచ్చదో వివరించాడు. ఆమె అందులో ఏమేమో వేస్తుంది. చిల్లీలో బీన్స్ వేసి ఆమెకు నచ్చిన పొడులు వేస్తుంది. ఆమె చేసే ఆ వంటకం అస్సలు నచ్చదు.

చాలా ఏళ్లుగా ఆమెకు ఇదే చెబుతున్నా. అయినా ఆమె తీరు మారడం లేదు. రెండు వారాల క్రితం కూడా ఆమె అదే చేసింది. అది తిన్న నేను అస్వస్థతకు గురయ్యా. వాంతులు చేసుకున్నా. జబ్బు పడ్డా అని స్నేహితులతో చెబుతున్నాడు. వూడీ తన మాటలు కొనసాగిస్తుండగానే అతడి భుజంపై ఓ చేయి పడింది. ఆయన తిరిగి చూసి అవాక్కయ్యాడు. తన భార్య. నిప్పులు చెరుగుతూ కనిపించింది. ఏం చెప్పాలో, ఆమెను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు. చేతితో ముఖం మూసుకుని అలానే కూర్చుండిపోయాడు. భార్య గురించి ఆయన చెప్పిన మొత్తం విషయాలు ఆమె వింది.

అతడు మొదలు పెట్టినప్పుడే లోపలికి వచ్చిన ఆమె ఏం చెబుతాడా అని వేచి చూసి చివరికి ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమె వచ్చిన విషయాన్ని సైగల ద్వారా స్నేహితులు చెబుతున్నా ఆయన ఆ సైగలను గుర్తించలేకపోయాడు. ఫలితంగా అడ్డంగా బుక్కయ్యాడు. వంటకాల్లో చిల్లీ స్థాయి ఎలా ఉంటుందో వూడీకి ఇప్పుడు తెలిసి వస్తుందని, ఇప్పుడుంటుంది అసలు కథ అని అతడి ఫ్రెండ్స్ ఛలోక్తి విసురుతూ, ఒకటే నవ్వులు.

ఇది కూడా చదవండి: బీజేపీ మహిళా నేతకు స్టేజిపై 'ఐ లవ్ యూ' చెప్పిన కుర్రాడు.. తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చదవండి: తన తల్లిని చంపిన హంతకుడ్ని పట్టించిన ఐదేళ్ల చిన్నారి.. ఇందులో ట్విస్ట్ వింటే దిమ్మతిరుగుద్ది!

ఇది కూడా చదవండి: 5 లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తున్న స్టార్ హీరో..

English summary

A funny video gets fire between husband and wife. A husband told to his friends about his wife dishes.