మూడు నెలల ముందే భూమ్మీద పడ్డ 'మిరాకిల్'

A girl alive in her mother's womb when she was died

03:10 PM ON 21st September, 2016 By Mirchi Vilas

A girl alive in her mother's womb when she was died

జరగరాని అద్భుతం ఆవిష్కృతమైతే, అది మిరాకిల్ అంటాం కదా. అలాగే నవమాసాలు అయ్యాక తల్లి కడుపులోంచి భూమ్మీద పడుతుంటారు. కానీ కొందరు ఒకటి రెండు మాసాలకే బయట పడతారు. కానీ మూడు నెలలు ముందుగానే లోకాన్ని చూసింది ఓ చిన్నారి. తొమ్మిది నెలల తర్వాత తల్లి గర్భంలోనుంచి బాహ్య ప్రపంచంలోకి రావాల్సిన ఆ చిన్నారి విధిలేని పరిస్థితుల్లో ఆరు నెలలకే లోకాన్ని చూసింది. చికాగోలో ఈ అద్భుతం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ పందొమ్మిదేళ్ల గర్భిణి బుల్లెట్ గాయాలతో చనిపోయింది. కానీ, ఆమె కడుపులోని బిడ్డ మాత్రం ప్రాణాలతో నిలిచింది. చనిపోయిన ఆ తల్లి గర్భంలో నుంచి బిడ్డను సురక్షితంగా వైద్యులు బయటకు తీశారు. వాస్తవానికి ఆమె ఈ పాపకు డిసెంబర్ లో జన్మనివ్వాల్సి ఉంది.

అయితే, మూడు నెలల ముందుగానే జన్మించి సురక్షితంగా కనిపించి అబ్బురపరిచిన ఈ పాపకు మిరాకిల్ అని పేరు పెట్టారు. పరాశ బియర్డ్(19) అనే మహిళ ఓ 26 ఏళ్ల వ్యక్తితో కలిసి దక్షిణ చికాగోలోని ఓ కారులో కూర్చొని ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని దుండగులు అటుగా వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఆమె మెడలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోగా, పక్కన వ్యక్తి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బంది గర్భవతి అయిన పరాశను ఆస్పత్రికి తరలించగా మూడు నెలల ముందుగా ఈ మిరాకిల్ లోకాన్ని చూసింది. బియర్డ్ ఇంటికి వెలుపల సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే, బియర్డ్ తో కారులో ఉన్న వ్యక్తి ఓ గ్యాంగ్ సభ్యుడంట. అతడిపై జరిపిన కాల్పుల కారణంగా నిండు చూలాలు బలవ్వాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary

A girl alive in her mother's womb when she was died