తనకి జాబ్ వచ్చిందని లవర్ కి చెప్తే ఫోన్ కొనివ్వమంది.. కానీ ఇంతలోనే..

A girl asked a smartphone from her boyfriend

05:35 PM ON 25th August, 2016 By Mirchi Vilas

A girl asked a smartphone from her boyfriend

ఓ అబ్బాయి తనకి జాబ్ వచ్చిందని తన ప్రియురాలికి చెప్పడమే అతడు చేసిన తప్పయింది. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపే తన లవర్ షాక్ ఇచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని ఆగ్రాలో ఈ విచిత్ర ఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన ఓ యువకుడు నైనిటాల్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఆ విషయాన్ని తన ప్రేయసికి చెప్పాడు. సరే జాబ్ వచ్చింది కదా. నాకు స్మార్ట్ ఫోన్ కొనివ్వు అని ఆ అమ్మాయి అడిగింది. నేను నైనిటాల్ వెళ్లాక అక్కడి నుంచి పంపిస్తాలే అని అబ్బాయి చెప్పాడు. దీంతో అతడిపై ఆ అమ్మాయి అనుమానం వచ్చిందో ఏమో తనకు అప్పటికప్పుడే ఫోన్ కొనివ్వాలని పట్టుబట్టింది.

తామిద్దరూ నడిరోడ్డుపై ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి గొడవకు దిగారు. ఆ యువకుడిపై అమ్మాయి చేయి చేసుకుంది. చొక్కా చించేస్తూ.. చెంప పగలగొట్టింది. కాలితో తన్నుతూ నానా రచ్చ చేసింది. వీరి గొడవ చూసిన వాళ్లంతా షాక్ నుంచి తేరుకుని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఇద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు.

English summary

A girl asked a smartphone from her boyfriend