ఫుల్లుగా తాగి ఎస్సై చెంప చెళ్లుమనిపించిన యువతి!

A girl beats SI with full drunk in Mumbai

01:27 PM ON 28th June, 2016 By Mirchi Vilas

A girl beats SI with full drunk in Mumbai

ఓ యువతి ఫుల్లుగా తాగి ఎస్సై చెంప చెళ్లుమనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ యువతి డ్యూటీలో ఉన్న ఓ పోలీసు ఆఫీసర్ పై చేయి చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన ఈ నెల(జూన్)15న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో మద్యం మత్తులో ఉన్న ఓ యువతి నేరుగా వెళ్లి ఓ పోలీసుతో గొడవ పడటమే కాకుండా ఎస్సైని అసభ్యంగా తిడుతూ కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయి చేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు.

అయితే, అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది? వారి మధ్యలో జరగుతున్న సంభాషణ ఏమిటీ? ఆ యువతి ఎందుకలా ఎస్సైని కొట్టింది? ముంబైలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తం మీద ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా హల్ చల్ చేస్తుంది.

English summary

A girl beats SI with full drunk in Mumbai