రాత్రంతా యువకుని గదిలో ఉంది.. ఆపై షాకిచ్చింది!

A girl blackmails a boy in Rajasthan

11:48 AM ON 18th August, 2016 By Mirchi Vilas

A girl blackmails a boy in Rajasthan

బ్లాక్ మెయిలింగ్ రకరకాలుగా మారిపోతోంది. ఉచ్చ నీచాలు మరచి ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా సాగిన బ్లాక్ మెయిలింగ్ యవ్వారం చూస్తే, నివ్వెరపోతారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని జుంజును జిల్లాకు చెందిన 19 ఏళ్ల పీజీ కళాశాల విద్యార్థిని లాల్ కోఠిలోని హాస్టల్ లో నివాసముంటోంది. గుర్గామ్ కు చెందిన యువకుడితో మాట కలిపి రాత్రంతా అతని గదిలోనే ఉంది. అంతే ఉదయాన్నే ఆ యువతి తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని యువకుడిని బ్లాక్ మెయిలింగ్ చేసింది. పోలీసు కేసులకు భయపడిన ఆ బాధిత యువకుడు యువతి అడిగిన విధంగా డబ్బు ఇచ్చి, భవిష్యత్ లో ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ చేయరాదనే షరతుతో అఫిడవిట్ పై యువతి సంతకం తీసుకున్నారు.

మళ్లీ బుధవారం మరోసారి రూ.18 లక్షలు ఇవ్వాలని యువకుడిని డిమాండు చేసింది. దీంతో యువకుడు నారాయణ్ సింగ్ సర్కిల్ లో రెండు లక్షల రూపాయలు యువతికి ఇచ్చి, పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించాడు. అంతే పోలీసులు హుటాహుటిన వచ్చి కళాశాల యువతిని అరెస్టు చేసి ఆమె నుంచి 27 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై యువకుడిని బ్లాక్ మెయిలింగ్ చేసిన యువతిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. అమ్మాయిల ఎరలో పడ్డారా ఇక అంతే! తస్మాత్ జాగ్రత్త.

English summary

A girl blackmails a boy in Rajasthan