అక్కడికి వెళ్ళిన అమ్మాయి తల్లి అయ్యి తిరుగొచ్చింది

A girl came as a mother from Nigeria Boko Haram

12:29 PM ON 21st May, 2016 By Mirchi Vilas

A girl came as a mother from Nigeria Boko Haram

అక్కడికి వెళ్ళిన అమ్మాయి తల్లి అయ్యి తిరుగొచ్చింది. అవును అసలు విషయంలోకి వెళ్తే.. నైజీరియాలో బొకోహార‌మ్ ఉగ్ర‌వాదుల ఘోరాలకు అంతు లేకుండా పోతుంది. వారు జ‌నారణ్యంలోకి ప్రవేశించి ఎప్పుడు ఎంత‌మంది బాలిక‌ల‌ను ఎత్తుకుపోతారో కూడా తెలియ‌డం లేదు. ఉగ్ర‌వాదుల‌కు మైన‌ర్ బాలిక‌లు దొరికారంటే వారి జీవితం అంధ‌కారంలోకి వెళ్లిపోవాల్సిందే. రెండేళ్ల క్రితం ఓ పాఠ‌శాల మీద దాడి చేసిన బొకోహారమ్ ఉగ్రవాదులు మొత్తం 273 మంది బాలిక‌ల‌ను ఎత్తుకుపోయారు. అక్క‌డ ఆ మైన‌ర్ బాలిక‌లు ఉగ్ర‌వాదుల చేతుల్లో చిక్కుకుని, వారి కామ కోరిక‌ల‌కు న‌లిగిపోయారు. రెండేళ్ల క్రింద‌ట అపహరణకు గురైన 273 మంది బాలికల్లో ఓ బాలిక తప్పించుకుని వచ్చింది.

ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న ఆ బాలిక ఓ చంటి బిడ్డతో తిరిగొచ్చింది. ఉగ్రవాదులను అణిచివేసేందుకు నైజిరీయా సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ లో భాగంగా ఈ యువతికి విముక్తి లభించింది. ఆమె ఈ రోజు అధ్యక్షుడు ముహమ్మద్ బుహారిని కలవనుంది. కిడ్నాప్ చేసిన బాలిక‌ల‌ను బ‌ల‌వంతంగా ముస్లిం మతంలోకి మార్చడం, వారి కామ కోరిక‌ల‌కు వాడుకోవ‌డం, బలవంతపు పెళ్లిల్లు చేసుకోవడం ఇలాంటివి ఎన్నో చేశారు. ఈ క్రమంలోనే అమినా అలి దర్శాకెకి అనే యువతిని కూడా అందులో ఓ ఉగ్రవాది బలవంతపు వివాహం చేసుకున్నాడు. ఆమెను గర్భవతిని చేసి వదిలిపెట్టాడు.

ఈ మధ్యకాలంలోనే ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపనే ఎత్తుకుని సాంబిసా అడవిలో తిరుగుతూ నైజీరియా బలగాలకు తారసపడటంతో ఆమెను సురక్షితంగా హెలికాప్టర్ ద్వారా తరలించి వైద్యం చేయించారు.

English summary

A girl came as a mother from Nigeria Boko Haram