15 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయబోతే... కోసి పారేసింది!

A girl cuts boy's penis while he is raping her

10:19 AM ON 25th June, 2016 By Mirchi Vilas

A girl cuts boy's penis while he is raping her

తనను కత్తితో బెధిరించి.. తన పై అఘాయిత్యానికి తెగబడిన వ్యక్తిపై సివంగిలా విరుచుకుపడి మర్మాంగాలను కోసేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకుంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన గురించి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంచోలి ప్రాంతంలో ఉన్న అడవిలోకి 15 ఏళ్ల అమ్మాయి వెళ్లడం గమనించిన రాయిస్ అనే యువకుడు ఆమె వెనుకే వెళ్లి.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఆ బాలికను బెధిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసాడు. దీనిని తీవ్రంగా ప్రతిఘటించిన ఆ అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని.. ఆ యువకుడి చేతిలోని కత్తిని లాక్కుంది.

మెరుపు వేగంతో అతని మర్మాంగాలను కోసి పారేసి.. అక్కడి నుంచి పరుగు తీసింది. ఇక ఆ యువకుడు అరుపులు, కేకలు పెట్టడంతో, సమీపంలో ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో నింధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary

A girl cuts boy's penis while he is raping her