షాక్: విమానంలో ఎవరూ చేయని పని చేసింది(వీడియో)

A girl did weird behavior in flight

06:09 PM ON 10th September, 2016 By Mirchi Vilas

A girl did weird behavior in flight

విమాన ప్రయాణికులను ఓ మహిళ తన చేష్టలతో బెంబేలెత్తించింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుంచి కాబోసాస్ లుకాస్ వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న మహిళ తోటి ప్రయాణికులు నిద్రిస్తున్న వేళ విమానంలో ఎవరూ చేయని పనిచేసింది. ఏం తోచలేదో ఏమో.. ఒక్కసారిగా సీట్లోంచి లేచి సర్దుకుని దానిపైనే శీర్షాసనమేయడం మొదలుపెట్టింది. అలికిడికి లేచి చూసిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు బిత్తరపోయారు. తర్వాత తేరుకుని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఎయిర్ హెస్టస్ ఆ మహిళ వద్దకు చేరుకుని ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించింది.

ఒంట్లో అనీజీగా ఉండడంతో ఉపశమనం కోసం ఇలా ట్రై చేస్తున్నానని చెప్పి షాకిచ్చింది. తన విన్యాసాలు ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తే మాత్రం మానేస్తానని చెప్పింది. దీంతో వారించిన ఆమె మరోసారి అలా చేయవద్దని చెప్పి వెళ్లిపోయింది. ఎయిర్ హెస్టస్ వెళ్లిన కాసేపటికే మళ్లీ ఆమె శీర్షాసనం వేయడం మొదలుపెట్టింది. ఆమె ఫీట్లను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: 2.5 కోట్లతో భారీ సెట్.. అదరహో అనిపించిన పెళ్లి(వీడియో)

ఇది కూడా చదవండి: సెక్స్ చేస్తుండగా మాజీ భర్తను తలచుకుందని ప్రియురాల్ని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: ఐఫోన్ 7 ఫీచర్స్ చూస్తే దిమ్మతిరుగుద్ది!

English summary

A girl did weird behavior in flight