కిడ్నీ దానం చేసి ప్రియుడిని రక్షించుకున్న ప్రేయసి!

A girl donated her kidney for her lover

10:40 AM ON 14th July, 2016 By Mirchi Vilas

A girl donated her kidney for her lover

ప్రేమంటే గుడ్డిదని అంటారు కానీ, నిజమైన ప్రేమ తను ప్రేమించిన వారు క్షేమంగా ఉండాలని కూడా కోరుకుంటుంది. సరిగ్గా ఒక యువతి కూడా అలాగే ఆలోచించింది. తన ప్రేమతో తన ప్రియునికి కొత్త జీవితాన్ని ప్రసాదించి, కాపాడుకుంది. అతని కళ్లలో మెరుపులు మెరిపించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ కు చెందిన జాక్ సిమర్డ్(49), మిషెల్లి లాబ్రాంషెకు ఒక గోల్ఫ్ కోర్సులో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమకు దారితీసింది. న్యూ హ్యాంప్ షైర్ లోని స్టోన్ బ్రిడ్జ్ కంట్రీ క్లబ్ లో ఇద్దరు కలసి తరచూ గోల్ఫ్ ఆడేవారు. అయితే, సిమర్డ్ రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో గత కొంతకాలంగా కిడ్నీదాత కోసం ఎదురుచూస్తున్నాడు.

కొన్ని సంవత్సరాల క్రితం అతని సోదరి కిడ్నీ ఇవ్వడంతో ఒక కిడ్నీని అమర్చారు. ఇటీవల రెండో కిడ్నీకూడా చెడిపోవడంతో దాత కోసం వెతుకులాట ప్రారంభించాడు. అయితే జాక్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రేయసి మిచెల్లీ క్షణం ఆలస్యం చేయకుండా ఎవ్వరికి చెప్పకుండా, తన కిడ్నీ ఆయనకు సరిపోతుందో లేదో పరీక్షలు చేయించుకుంది. తన కిడ్నీలు జాక్ కి సరిపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అతనికి ఇవ్వడానికి సిద్ధపడింది. చివరకు తన ప్రాణాలకు ప్రమాదమని తెల్సి కూడా ప్రియుడికి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని డాక్టర్ల ముందు కూడా వెల్లడించింది.

కిడ్నీఇస్తే నీ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని డాక్టర్లు పదేపదే చెప్పినా వినకుండా, మిచెల్లీ వారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. 'అతనే నా ప్రాణం... భవిష్యత్తు' అంటూ.. జాక్ ఆరోగ్యంతో ఉంటే నాకు అదే చాలని డాక్టర్లను కోరింది. ఆ ప్రేమికురాలి తపనను అర్థం చేసుకున్న డాక్టర్లు కిడ్నీ మార్పునకు ఓకే చెప్పారు. దీంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అనుకున్నట్టుగానే ఆపరేషన్ జరిగింది. అసలు విషయం ఏమంటే, ఈ విధంగా ప్రేయసి కిడ్నీ ఇచ్చిన సంగతి ఇప్పటికీ జాక్ కి తెలియదట. అదండీ అసలు సిసలైన ప్రేమ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

English summary

A girl donated her kidney for her lover