బర్త్ డే పార్టీ సామూహిక అత్యాచారం చేసి అమ్మేశారు

A Girl Gang Raped And Sell Her In Bihar

09:47 AM ON 11th March, 2016 By Mirchi Vilas

A Girl Gang Raped And Sell Her In Bihar

ఆమెను బర్త్ డే పార్టీకి పిలిచారు.. తర్వాత ఆమె మీద ఆ మృగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగ లేదు చివరకు ఆమెను వ్యభిచార కూపంలోకి దించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ వికృత ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత హేయమైన ఈ ఘటన వివరాలోకెళ్తే.. నలంద జిల్లాకు చెందిన ఓ యువతిని స్నేహితులు పుట్టినరోజు వేడుకలకు రమ్మని ఆహ్వానించారు. తీరా అక్కడకు వెళ్ళాక ఆమెపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ వ్యభిచార గృహానికి ఆమెను అమ్మేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని రక్షించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నలుగురు వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన తెల్సి ఆ ప్రాంతంలో అందరూ ఆశ్చర్య పోతున్నారు.

English summary