నాలుక కోసుకుని శివునికి అర్పించిన 11 ఏళ్ళ బాలిక

A girl in Chhattisgarh cuts her tongue for God

05:43 PM ON 21st April, 2016 By Mirchi Vilas

A girl in Chhattisgarh cuts her tongue for God

భక్తీ ఎన్నో రకాలు.. మూఢ భక్తి, పిచ్చి భక్తి, మామూలు భక్తి, వెర్రి భక్తి.. అయితే ఛత్తీస్‌గఢ్ లోని ఓ 11 ఏళ్ళ బాలిక శివుని పట్ల నిజమైన మూఢ భక్తిని ప్రదర్శించింది. తన నాలుకను కోసుకుని శివలింగానికి అర్పించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగీతారాయ్ గ్రామంలో పురాతన శివాలయం ఉంది. చదువు పై ధ్యాస లేక చిన్నప్పటి నుంచి స్కూల్ మానేసిన 11 ఏళ్ల చమేలీ సిదార్, శనివారం నుంచి అక్కడే ఉండి పూజలు చేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కత్తితో తన నాలుక కోసుకుని శివలింగానికి అర్పించింది. ఆ తర్వాత సృహ కోల్పోయింది.

కొద్ది సేపటి తర్వాత తేరుకుని తిరిగి పూజలు ప్రారంభించింది. విషయం తెలిసిన పోలీసులు, జిల్లా అధికారులు అక్కడికి వచ్చారు. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. శివుడి దయతో వైద్య సహాయం లేకుండానే ఆమె కోలుకుంటుందని గట్టి నమ్మకంతో చెప్పారు. దీంతో చేసేది లేక ఓ డాక్టర్‌‌ను ఉంచి అధికారులు వెనుదిరిగారు. గతంలోనూ ముగ్గురు బాలికలు ఆ శివాలయంలో తమ నాలుకలు కోసుకుని శివునికి అర్పించారు. ఎలాంటి చికిత్స లేకుండానే వారు కోలుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. చమేలీ కూడా కాస్త కోలుకుందని, ఆమె పరిస్థితి బాగానే ఉందని గ్రామ సర్పంచ్ గోపాల్ బుధవారం పోలీసులకు తెలిపారు.

English summary

A girl in Chhattisgarh cuts her tongue for God. A 11 years girl in Chhattisgarh cuts her tongue for Lord siva.