మోసం చేసిన ప్రియుడిని తెలివిగా కడతేర్చిన ప్రేయసి

A girl kills his boyfriend

04:05 PM ON 4th May, 2016 By Mirchi Vilas

A girl kills his boyfriend

హత్య కాని హత్య ఇది... అదేనండి ఆత్మహత్యగా మలచిన తెలివైన హత్య ఇది... కలిసి చద్దామని ప్రియుణ్ణి ఒప్పించి, తీరా అక్కడికి వెళ్ళాక డ్రాప్ అయింది ప్రేయసి. పాపం అతడు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ఈవూరులో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే, ఈవూరికి చెందిన వెంకటేష్, అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చాలాకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఇద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళాల్సింది. కానీ కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రావడంతో తగాదా పడ్డారు. దీంతో తన మేనమామ కూతురిని వెంకటేష్ గత శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు.

ఇక ప్రియురాలు విషయం తెలుసుకుని ప్రియుడి ఇంటికి వెళ్లి గొడవ పడింది. ఆమర్నాడు ప్రియురాలి సోదరులు వెంకటేష్ ఇంటికి వచ్చారు. జరిగిందేదో జరిగిపోయింది, మందు కొడదాం రా.. అంటూ ఊరి బయటకు తీసుకెళ్ళారు. ముగ్గురూ ఫుల్లుగా తాగారు. ఈలోగా ప్రియురాలు అక్కడకు చేరుకుంది. దీంతో ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు. ఆ మాటల్లో 'కనీసం ఇద్దరూ కలిసి బతకలేకపోతున్నాం, కనీసం కలిసి అయినా చద్దాం' అనుకున్నారు. అంతే పురుగుల మందు తెచ్చుకుని గ్లాసుల్లో పోసుకున్నారు. ముందుగా వెంకటేష్ తాగేసాడు. ఇక ప్రియురాలి అసలు రూపం బయటపడింది.

'నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావ్, మోసం చేసావ్, చావు.. నువ్వు పొతే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా వస్తుంది. అందుకే నేను మాత్రం పురుగుల మందు తాగను' అంటూ డ్రాప్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దీంతో అతి కష్టం మీద ఇంటికి చేరిన వెంకటేష్ జరిగిన విషయం ఇంట్లో వాళ్లకు వివరించాడు. ఈలోగా ఆసుపత్రికి చేర్చేలోగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రియురాలి కోసం గాలిస్తున్నారు. అయితే, పెళ్ళైన 24 గంటల్లోనే భర్తను కోల్పోయిన అతని భార్య మాత్రం రోధిస్తోంది.

English summary

A girl kills his boyfriend. A girl kills his boyfriend by intelligently. He drunk poison for her after that she didn't drink the poison.