ఒకరిని ప్రేమించింది.. మరొకరిని పెళ్లి చేసుకుంది.. క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్!

A girl loved one and married another one

06:18 PM ON 16th August, 2016 By Mirchi Vilas

A girl loved one and married another one

ఇది నిజంగా ట్విస్టే..! ఈ విచిత్రమైన సంఘటన కేరళలో జరిగింది. ఒక ఎంఎన్సి కంపెనీలో పని చేస్తున్న ఓ యువతి ఒక అబ్బాయిని ప్రేమించింది. అయితే ఆ అబ్బాయి తక్కువ కులం వాడు కావడంతో వారి పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి చేశారు. అయితే మనసునిండా ప్రేమికుడే ఉండటంతో పెళ్లయిన కొన్ని గంటల్లోనే ఆ వివాహ బంధాన్ని తెంచుకుంది. తాళికట్టిన భర్త వెంట వెళ్లిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. తిరిగి పుట్టింటికి చేరింది. ఈ పరాభవాన్ని దిగమింగుకున్న ఆమె తండ్రి ప్రియుడి వద్దకు వెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని కోరాడు.

అయితే మరో వ్యక్తితో ఓ రోజంతా ఉన్న ఆమెను పెళ్లి చేసుకోనని ఆ అబ్బాయి(లవర్) తెగేసి చెప్పాడు. దీంతో ఆమె పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా మారింది. ఇక పెళ్లి తంతు పూర్తవ్వడంతో పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు పెళ్లి బంధాన్ని తెంచుకుని, మరోవైపు ప్రియుడు కూడా కాదనడంతో ఆమె జీవితం అటూ ఇటూ కాకుండా నాశనమైపోయింది.

English summary

A girl loved one and married another one