ఒక అమ్మాయిని ప్రేమించిన మరో అమ్మాయి.. ఆ తరువాత వాళ్ళేం చేసుకున్నారో తెలిస్తే షాకే!

A girl maaried another girl in Agra

04:03 PM ON 27th June, 2016 By Mirchi Vilas

A girl maaried another girl in Agra

అవును మీరు విన్నది నిజమే ఒక అమ్మాయిని మరో అమ్మాయి ప్రేమించింది. ఆ తరువాత ఏం వాళ్ళు ఏం చేశారో తెలిస్తే షాకౌతారు! ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ఈ విచిత్ర ఘఠన ఆగ్రాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థిని అక్కడే స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్న 25 ఏళ్ల మహిళను ప్రేమించింది. ఆ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులను అడిగింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో జనవరి 4న ఇంటి నుంచి పారిపోయింది.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆగ్రాకు సమీపంలోని ద్వేరి అనే గ్రామంలో ఆ యువతిని గుర్తించారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. అప్పటికే వారు సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువతి మాత్రం తన తల్లిదండ్రులతో వెళ్లేది లేదని, తన పెళ్లి అయిపోయిందని తెలిపింది. మేజర్ కావడంతో పోలీసులు ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.

English summary

A girl maaried another girl in Agra