పెళ్లాడతారు... దోచేస్తారు

A Girl Marries 14 Times in Rajasthan

06:24 PM ON 9th February, 2016 By Mirchi Vilas

A Girl Marries 14 Times in Rajasthan

సాధారణంగా అబ్బాయిల చేతిలో అమ్మాయులు మోసపోవడం చూస్తుంటాం. కానీ ఓ అమ్మాయి చేతిలో ఒకరా ఇద్దరా ఏకంగా 14మంది మోసపోయారు. అబ్బాయిలైతే అమ్మాయిల శీలం దోచుకుంటారు. అదే ఈ అమ్మాయి అయితే , అబ్బాయిలను పెళ్లి చేసుకుని, విలువైన వస్తువులను దోచుకుని ఉడాయిస్తుంది. ఈ జగత్ కిలాడి గురించి తెలుసుకోవాలంటే, ఒకసారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే. ఈ రియల్ స్టోరీ రాజస్థాన్ లో జరిగింది. ఆమె పెళ్లి కాని అమ్మాయిలా పరిచయమవుతుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకుంటుంది. తాళి కట్టించుకుని అత్తవారింట అడుగుపెడుతుంది. ఆలా అడుగు పెట్టిందో లేదు ఆమె కళ్ళు ఖరీదైన వస్తువులు ఎక్కడ ఉన్నాయో అక్కడ పడతాయి. ఇంకేముంది, దొరికినకాడికి దోచేసి, అందరి కళ్లూ కప్పి అక్కడి నుంచి ఉడాయిస్తుంది. అలా ఇప్పటి వరకు .ఒకటా? రెండా? అంటే 14 మందిని పెళ్ళాడి ఇలాగే చేసింది. ఈమె వెనుక పెద్ద ముఠా కూడా వుంది.

రాజస్థాన్ లోని కోటాకు చెందిన వందన ఇప్పటి వరకు ఒకరికి తెలియకుండా, ఒకర్ని పెల్లాడుతూ, 14 మందిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని వాళ్లింట కాలు పెట్టగానే ఇంట్లో విలువైన సొత్తుని దోచుకుని పరారే. ఈ విధంగా మోసపోయిన వాళ్ళలో కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తే వందన గురించి అవాక్కైపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తాను పెళ్లిమీద పెళ్లి చేసుకుని ఇళ్లు దోచుకోవడమే కాదు.. ఓ ముఠాను ఏర్పాటు చేసింది. ఆ బ్యాచ్ లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన 14 మంది యువతులు ఉన్నారు. వాళ్లు కూడా వందన లాగే అందినకాడికి దోచుకుని పంచుకునే రకమే. ప్రస్తుతం బాధితుల ఫిర్యాదుతో వందన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు వున్నారు. సినిమా కధను సైతం మరపించే ఈ జగత్ కిలాడి , ఆమె వెనుక ముఠా ను తలచుకుంటేనే కొందరు పురుష పుంగవులు హడలెత్తి పోతున్నారట. యువకులూ పారా హుషార్ ....

English summary

A girl in Rajasthan marries 14 times.Her name was vandana and she married various men from Gujarat,Madhyapradesh,Chattisgarh states.She marries some one and she used to steal valuable things in the house.The girl formed a team of total number of 14 girls and they were also used the same thing