పెళ్ళికి ఒప్పుకోలేదని తల్లిని కత్తితో 30 సార్లు పొడిచి చంపేసింది

A girl murdered her parents with knife and gun

06:15 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

A girl murdered her parents with knife and gun

అసలు ఏంటీ దారుణం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? రోజు రోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమౌతుంది ఈ లోకం? అసలు మనం మనుషుల్లా బ్రతుకుతున్నామా? ఏంటి దారుణం? తన ప్రేమని కాదన్నారని ఓ కిరాతకురాలు(అమ్మాయి) తనని కన్న తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకుంది. తండ్రిని తుపాకీతో కాల్చి, తల్లిని పొడిచి చంపేసింది. ఈ సంఘటన అమెరికాలోని నార్తర్న్‌ విస్కాన్సిస్‌లో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే విస్కాన్సిస్‌ కి చెందిన మార్టిన్‌సన్‌ అనే అమ్మాయి తన ప్రేమని అంగీకరించలేదని కన్న తల్లిదండ్రులని చంపేసి తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఇండియానా కి పారిపోయింది.

అయితే ఆమె తల్లిదండ్రుల మృతదేహాలను గుర్తించిన పోలీసులు వీళ్ల కూతురే ఈ హత్యలు చేసి ఉంటుందన్న అనుమానంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఆ తరువాత అదే నిజమని తెలిసాకా పోలీసులే ఆశ్చర్యపోయారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు మార్టిన్‌సన్‌ ని చేధించి పట్టుకున్నారు. ఆ తరువాత మార్టిన్‌సన్‌ ని విచారించగా నా బాయ్‌ఫ్రెండ్‌ అంటే మా తల్లిదండ్రులకి ఇష్టం లేదని, మా ఇద్దరినీ కలుసుకోనిచ్చేవారు కాదని, నా బాయ్‌ఫ్రెండ్‌ని బెధిరించారని, అంతే కాకుండా నన్ను ఇంట్లో బంధించేశారని చెప్పింది. దీనితో కోపం వచ్చి నా తండ్రిని గన్‌తో కాల్చేశా, ఇది చూసి నా తల్లి నా పై కత్తితో దాడి చెయ్యబోతే నేను ఆ కత్తిని లాక్కుని ఆమెని పొడిచేశా అని చెప్పింది.

మృతదేహాలని పోస్టు మార్టం కి పంపిన పోలీసులు ఆమె తల్లి మృతదేహం పై 30 చోట్లు బలమైన కత్తి పోట్లు ఉన్నాయని గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు కి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. ఇంకో రెండు నెలల్లో మార్టిన్‌సన్‌ కి ఆ హత్యల నేరం పై 120 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయవాధులు అంచనా వేస్తున్నారు.

English summary

A girl murdered her parents with knife and gun. American girl Martinson murdered her parents for not agreeing her love.