ఆమె తన ఫ్రెండ్ కోసం చేసిన త్యాగం తెలిస్తే షాకౌతారు!

A girl sacrificed her medical seat for her friend

10:53 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

A girl sacrificed her medical seat for her friend

ఓ అమ్మాయి తన ఫ్రెండ్ కోసం చేసిన త్యాగానికి దేశవ్యాప్తంగా అభినందనలు అందుకుంటుంది. ఇంతకీ ఆమె చేసిన పనేమిటి? ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో రాష్ట్ర మెడికల్, డెంటల్ కౌన్సెలింగ్ సందర్భంగా.. సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. త్రిచిలోని సమయపురానికి చెందిన వర్షిణి, జనని అనే ఇద్దరు అమ్మాయిలు.. ఎల్.కే.జీ నుంచి ఫ్రెండ్స్. డాక్టర్ కావాలని చిన్నతనం నుంచే ఇద్దరూ కలలుగనేవారు. అందుకోసం మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయగా.. ఎక్స్ సర్వీస్మెన్ పిల్లల కోటాలో ఇద్దరూ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు చెన్నై వచ్చారు. వర్షిణికి కాస్త మెరుగైన ర్యాంక్ రావడంతో ఆమెను ముందుగా కౌన్సెలింగ్ కి పిలిచారు.

జనని కూడా ఆమె వెనుకే ఉన్నా.. ఆ కోటాలో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక సీటు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఇద్దరి మధ్య కేవలం 0.25 మార్కుల తేడా మాత్రమే. వెనుకబడిన వర్గానికి చెందిన వర్షిణికి సీటును కేటాయిస్తే.. జననికి నిరాశ తప్పదు. దీంతో తాను సీటు తీసుకుంటే.. జననికి సీటు రాదని భావించిన వర్షిణి.. ఏకంగా మద్రాస్ మెడికల్ కాలేజీ సీటును వదులుకుంది. దీనితో ఆమె వెనుకే ఉన్న జననికి సీటు ఖరారు అయింది. కౌన్సెలింగ్ నుంచి ఎందుకు తప్పుకున్నావని.. వర్షిణిని అడిగితే, తనకు దీనితో పాటు బీసీ కేటగిరీలోనూ రిజర్వేషన్ ఉన్నందున జనరల్ కౌన్సెలింగ్ లో కూడా సీటు పొందే అవకాశం ఉందని..

కానీ తన ఫ్రెండ్ కి ఆ ఛాన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, తాను అలా చేయకపోతే.. తన స్నేహితురాలు ఈ ఏడాది ఎం.బీ.బీ.ఎస్ లో చేరే అవకాశం కోల్పోతుందని సమాధానం ఇచ్చింది. తన స్నేహితురాలి నిర్ణయం పై జనని ఉబ్బితబ్బియింది. మరి ఫ్రెండ్ కోసం త్యాగం చేసిన వర్షిణికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జనరల్ కేటగిరీలో ఈ రోజు నుండి 25 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. మరి ఫ్రెండ్ కోసం త్యాగం చేసిన వర్షిణికి కూడా సీటు దొరకాలని నెటిజన్లు విషెస్ చెప్పేస్తున్నారు.

English summary

A girl sacrificed her medical seat for her friend