ఆ అమ్మాయికి వచ్చిన పార్సిల్ చూసి షాకైంది! అందులో ఏముంది?

A girl shocked by seeing the pen drive in the parcel

11:26 AM ON 25th June, 2016 By Mirchi Vilas

A girl shocked by seeing the pen drive in the parcel

తనకు కాబోయే భర్త కోసమని రొమాంటిక్ గా సెల్ఫీలు దిగిన ఓ యువతి ఆ ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు ఫార్వర్డ్ చేసింది. అయితే.. ఇంతలో అతనికి తెలియకుండా ఆ ఫోటోలు మరో వ్యక్తి చేతిలోకి వెళ్లడంతో రచ్చ రచ్చ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. థానేకి చెందిన ఓ యువతి ఇంటికి ఒక సీల్ చేసిన ఎన్వలప్ వచ్చింది. అందులో ఓ పెన్ డ్రైవ్ కూడా ఉంది. అది ఓపెన్ చేసి చూస్తే ఆమె షాక్ కి గురైంది. అందులో ఆమెకి భర్త కోసమని రొమాంటిక్ గా దిగిన ఆమె సెల్ఫీలు దర్శనం ఇచ్చాయి. ఆ తర్వాత ఓ పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ వచ్చింది. రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని బెధిరింపు.

సహజంగానే భయపడ్డ ఆ యువతి విషయం పోలీసులకు చెప్పేసింది. ప్లాన్ ప్రకారం పోలీసులు ఆమెను రూ. 5 లక్షలు తీసుకొని వెళ్ళమని.. ఆ అపరిచితుడుని రమ్మని పోలీసులు మఫ్టీలో వెళ్లారు. ఆ ప్లాన్ వర్కవుట్ అయింది. దీంతో అతడు దొరికేశాడు. తీరా అతడు ఎవరా అని చూస్తే.. తనకి కాబోయే భర్త స్నేహితుడే అతడు అని తేలింది. పెళ్లికొడుకు, తాను కలిసి థాయ్ లాండ్ వెళ్లినపుడు అతడి ఫోన్లోంచి ఈ ఫొటోలు తీసుకున్నానని.. తనకి డబ్బు బాగా అవసరం ఉండడంతో ఇలా చేసానని అతడు చేసిన బ్లాక్ మెయిలింగ్ గురించి ఒప్పేసుకున్నాడు.

English summary

A girl shocked by seeing the pen drive in the parcel