పవన్ పెళ్లి చేసుకోవాలంటూ ఇంటి ముందు ధర్నా!

A girl strikes at pawan's house to marry her

04:45 PM ON 30th September, 2016 By Mirchi Vilas

A girl strikes at pawan's house to marry her

సినీ నటుడు పవన్ కల్యాణ్ ను కలిసేందుకు అవకాశం ఇప్పించాలంటూ ఓ యువతి రోడ్డుపై బైఠాయించింది. తన బాధలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలంటూ సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగింది. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన జ్యోతి నాలుగు నెలలుగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని పవన్ నివాసానికి వస్తోంది. ఆయనతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా సెక్యూరిటీ నిరాకరిస్తూ వచ్చారు. దీంతో విసిగిపోయిన ఆమె పవన్ ఇంటి ముందు రోడ్డుపై దాదాపు మూడు గంటల పాటు బైఠాయించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ నాలుగు నెలలుగా పవన్ ఇంటి చుట్టూ తిరుగుతున్నా.. సెక్యూరిటీ, పీఏ ఆయనను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది.

తాను పవన్ అభిమానినని, కష్టాలు ఆయనతో చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని తెలిపింది. అంతే కాదు తనను పవన్ పెళ్లి చేసుకోవాలని ఆమె అనడంతో మానసిక స్థితిపై అనుమానం వచ్చిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెకు నచ్చజెప్పి స్టేషన్ కు తరలించారు.

English summary

A girl strikes at pawan's house to marry her