పేరెంట్స్ తో గొడవపడి సిమ్ మింగేసింది! ఏం జరిగిందో తెలుసా?

A girl swallowed sim card

09:34 AM ON 25th May, 2016 By Mirchi Vilas

A girl swallowed sim card

తల్లిదండ్రులతో గొడవపడి ఒక అమ్మాయి చెయ్యకూడని పని చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోన త్రిసూర్‌కి చెందిన 16 సంవత్సరాల అమ్మాయి తన తల్లిదండ్రులతో టీవీ చూస్తు గొడవ పెట్టుకుంది. ఇంతలో అనుకోకుండా తన చేతిలో ఉన్న సిమ్‌ కార్డును అమాంతం మింగేసింది. అనంతరం తనకు శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తడంతో డాక్టరును సంప్రదించారు. పరీక్షించిన డాక్టర్లు సీటీ స్కాన్‌ తీయగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే తన ఉపిరితిత్తుల్లో సిమ్‌ కార్డు ఇరుక్కుందని తేలింది. ఆసుప్రతి డాక్టర్లు వెంటనే అత్యవసరంగా సర్జరీ చేసి సిమ్‌ కార్డును తొలగించారు.

ప్రస్తుతం ఢిల్లీ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ వార్త నెట్‌లో హట్‌ టాపిక్‌గా మారింది. వేల కామెంట్లు చేస్తున్నారు. ఇంకా తన చేతిలో మొబైల్‌ ఉంటే పరిస్థితి ఏలా ఉండేదో అని వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు.

English summary

A girl swallowed sim card