డౌట్ వచ్చి టాయిలెట్ లోకి వెళ్లి ఫోన్ లో వీడియో తీసుకుంది.. కానీ..(వీడియో)

A girl taken video in train toilet

04:56 PM ON 26th August, 2016 By Mirchi Vilas

A girl taken video in train toilet

ఉత్తరప్రదేశ్ లో అనారోగ్యంతో తమ కూతురు మరణించిందని చెబుతూ హడావుడిగా అంత్యక్రియలు జరిపించిన ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని ప్రేమించిందని.. ఆ యువతిని పరువు హత్య చేసేందుకు కుటుంబీకులు బలవంతంగా యూపీలోని హత్రాస్ సమీపంలోని సోనీ గ్రామానికి రైల్లో తీసుకొని వెళుతున్నారు. ఆ సమయంలో టాయిలెట్లోకి వెళ్లిన బాధితురాలు తనని చంపుతారని అనుమానం వచ్చి తన సెల్ ఫోన్లో వీడియో తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాను మేజర్నని, ఓ యువకుడిని ప్రేమించానని, అందుకు తండ్రి, సోదరుడు, బంధువులు ఒప్పుకోకుండా తనను బలవంతంగా సొంతూరికి తీసుకు వెళుతున్నారని వీడియోలో యువతి వాపోయింది.

తనను చంపేందుకే తీసుకెళుతున్నారని, తాను చనిపోతే అందుకు వారిదే బాధ్యతని చెప్పింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కాగా.. కేసు నమోదు చేసిన హత్రాస్ పోలీసులు పారిపోయిన ఆమె కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. బహుశా రైల్లో ఆమెను కలిసిన ప్రియుడు ముందు జాగ్రత్తగా వీడియోను తీసి ఇంటర్నెట్ లో పెట్టాడని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2050కల్లా భూమిపై ఎంత మంది ఉంటారో తెలుసా?

ఇది కూడా చదవండి: తనని బ్రహ్మానందం మోసం చేసాడని రోడెక్కిన హేమ(వీడియో)

ఇది కూడా చదవండి: మనం పాటించే సంప్రదాయాలు వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ తెలిస్తే ఇక అవే ఫాలో అవుతారు!

English summary

A girl taken video in train toilet. In Uttar Pradesh a parents killed their daughter for she is loving another caste boy.