ఇంట్లో చేసే పెళ్లి తప్పించుకోవడానికి ఫ్రెండ్ ని భర్తగా నటించమంటే ఏం చేసాడో తెలుసా?

A girl's friend acted as a husband for his girlfriend

12:42 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

A girl's friend acted as a husband for his girlfriend

సినిమాను తలపించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన 22 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ చదువుకుంటోంది. ఆ యువతి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు. అంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి తండ్రి పెళ్లి ప్రయత్నాలను అడ్డుకోవాలనుకొని స్నేహితులతో చర్చించారు. తండ్రి పెళ్లి ప్రయత్నాలు చేయకుండా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నట్లు సృష్టించమని ఓ స్నేహితుడు సలహా ఇచ్చాడు. అంతే తన స్నేహితుడైన ఓ యువకుడితో పెళ్లి జరిగిందని, అతన్ని భర్తగా తల్లిదండ్రులకు పరిచయం చేసింది. దాంతోపాటు ఓ నకిలీ వివాహ సర్టిఫికేట్ ను కూడా యువతి సృష్టించింది.

కాని ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న స్నేహితుడే యువతికి తెలియకుండా తన పెళ్లిని రిజస్టరు చేయడంతోపాటు నిజమైన భర్తలాగా ఆమెపై అత్యాచారం జరిపాడు. యువతి తన పుట్టింటికి వెళ్లగా, ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని స్నేహితుడైన ఉత్తుత్తి భర్త భయపెట్టాడు. వడగామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య జరిగిన ఈ అత్యాచార ఘటనపై యువతి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 420ల కింద కేసు నమోదు చేసి సిన్హాఘడ్ రోడ్డు పోలీసులకు బదిలీ చేశారు. అహ్మద్ నగర్ కు చెందిన నిందితుడిపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సేమ్ సినిమా మాదిరిగా జరిగిన ఈ సంఘటన ముంబై జనానికి ఆశ్చర్యానికి గురి చేసింది.

English summary

A girl's friend acted as a husband for his girlfriend