అన్న వచ్చి రాఖీ కడతాడనుకుంటే.. కంటతడి పెట్టిస్తున్న ఓ చెల్లెలి దీన గాధ!

A girl's sad story on Rakhi festival

06:37 PM ON 19th August, 2016 By Mirchi Vilas

A girl's sad story on Rakhi festival

రాఖీ పండగకి అన్నయ వస్తాడు, బోలెడు బహుమతులు తెస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న చెల్లెలి ఆశలు అడియాశలు అయిపోయాయి. కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న చెల్లికి గుండెల నిండా భారం నింపేసాడు. అందరిని చూస్తూ తాను రేపైతే తన అన్నతో సంతోషంగా పండగ చేసుకుంటాను అనుకున్న చెల్లికి విషాదమే మిగిలింది. రాఖీకి ముందు రోజు జరిగిన ఉగ్రదాడిలో అతను చనిపోవడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. అన్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని, ఇంకెప్పటికీ తన చేత రాఖీ కట్టించుకోలేడని తెలిసి ఝార్ఖండ్ లోని చత్రా ప్రాంతానికి చెందిన యువతి తల్లడిల్లిపోతోంది.

ఆమె సోదరుడు శక్తి సైన్యంలో ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్నాడు. రాఖీ రోజున సోదరుడు ఇంటికి రావడంలేదని తెలిసి ఆమె రాఖీని కొరియర్ లో పంపింది. కానీ రాఖీ పండక్కి ఒక్క రోజు ముందే బుధవారం బారాముల్లా జిల్లా సరిహద్దులో జరిగిన ఉగ్రకాల్పుల్లో శక్తి చనిపోయాడు. సోదరి పంపిన రాఖీ అతనికి చేరేలోపలే అతను అందని లోకాలకు వెళ్లిపోయాడు. దాంతో రాఖీ పండగ రోజు ఆ ఇంట విషాదం నెలకొంది. శక్తి కుటుంబంలో పలువురు సైన్యంలో పనిచేస్తున్నారు.

English summary

A girl's sad story on Rakhi festival