తాతే మొగుడయ్యాడు... పెళ్లి తర్వాత షాక్ తిన్న యువతి!

A grand daughter married her grand father

02:02 PM ON 4th October, 2016 By Mirchi Vilas

A grand daughter married her grand father

పాశ్చాత్య దేశాల్లో పెళ్లికి వయసుతో గానీ, వావీవరసలతో గానీ సంబంధం ఉండదు. పెళ్లయ్యాక ఎన్నాళ్లు కలిసి ఉంటారో చెప్పలేం. విడిపోయాక మళ్లీ ఎవరిని చేసుకుంటారో తెలియదు. దీని వల్ల అక్కడి వాళ్లు ఒకరికి ఒకరు ఏమవుతారో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వింత పరిస్థితే ఇప్పుడు అమెరికాలోని మియామీలో ఓ 24 ఏళ్ల యువతికి ఎదురైంది. మూడు నెలల క్రితం 68 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని ఆ యువతి పెళ్లాడింది. పెళ్లయ్యాక అతడి ఇంట్లో ఉన్న ఫోటో ఆల్బమ్ లో ఆ యువతి తండ్రి ఫోటో ఉంది. ఈ ఫోటో గురించి ఆ యువతి ఆరాతీయడంతో అసలు విషయం తెలిసింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన కుమారుడని ఆ వృద్ధ భర్త చెప్పడంతో అది వినగానే తన తాతనే భర్తను చేసుకున్నాని తెలిసి ఒక్క క్షణం ఆమె షాక్ లో ఉండిపోయింది.

కొద్దిసేపటికి తేరుకుని అసలు విషయం ఆరా తీసింది. వివరాలలోకి వెళ్తే.. అతడికి అంతకు ముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలి భార్య పిల్లలతో సహా అతడిని విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం చాలా కాలం వెతికినా లాభం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, రెండో పెళ్లి అయ్యాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను పోషించలేక ఆమెను నుంచి కూడా విడాకులు తీసుకున్నాడు. అయితే అనుకోకుండా గత ఏడాది అతడికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. దీంతో 68 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ డేటింగ్ సైట్ ద్వారా చివరికి తన మనవరాలినే పెళ్లాడాడు. అయితే, ఆ యువతికి పెళ్లికి ముందే గర్భం రావడంతో ఆమె తండ్రి ఇంట్లో నుంచి గెంటేసాడు. ఆ వృద్ధుడికి ఆమె తన మనవరాలనే విషయం పెళ్లికి ముందు తెలియలేదు. అయితే కొసమెరుపు ఏంటంటే ఆయన తన తాత అయినంత మాత్రాన తాము విడిపోవాల్సిన అవసరం లేదని ఆ యువతి ప్రకటించడం కొసమెరుపు.

English summary

A grand daughter married her grand father