శునక రాజానికి ఊరంతా శ్రద్ధాంజలి..ఘనంగా అంతిమయాత్ర

A grand funeral to Dog In Medak

11:08 AM ON 17th March, 2016 By Mirchi Vilas

A grand funeral to Dog In Medak

ప్రస్తుత యాంత్రిక సమాజంలో ఒకరినొకరు పట్టించుకునే తీరిక లేదు ... కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగు అవుతున్నాయి. తల్లి దండ్రులను పట్టించుకునే పరిస్థితీ లేదు .. మానవత్వం అడుగట్టిపోతోంది ... ఇలా మనం తరచూ వింటున్నాం , చూస్తున్నాం ... కానీ గ్రామస్తుల అభిమానం చూరగొన్న ఓ గ్రామ సింహానికి అదేనండీ కుక్కకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఊరంతా కదిలి వచ్చింది. ఈ సంఘటన మెదక్‌ మండలం లింగ్సాన్‌పల్లిలో చోటుచేసుకుంది. రాజు అని పిలిచే ఈ శునకాన్ని గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందింది. అయితే అకాల మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...సుమారు ఆరేళ్ల క్రితం గ్రామంలో వూర కుక్క జన్మించింది.

దత్తత గ్రామ అభివృద్ధికి 'శ్రీమంతుడు' తొలి అడుగు

మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన శశికాంత్‌రెడ్డి అనే యువకుడు పొలానికి దాన్ని తీసుకెళ్లేవాడు. పొలం అటవీ ప్రాంత శివారులో ఉండడం వల్ల పగలు కోతులు, రాత్రి అడవిపందులు పంటను నాశనం చేస్తుండేవి. ఆ యువ రైతు కుక్కకు శిక్షణ ఇచ్చాడు. దీంతో అది కోతులను వెంబడించేంది. రాత్రి అడవిపందులు పంటలోకి రాకుండా కాపలా కాసేది. గతంలో రెండు కోతులను రాజు చంపేసింది. అప్పటి నుంచి కోతులు గ్రామంలోకి వస్తే ఒట్టు. గ్రామంలో ఏ ఒక్కరి ఇంటికో కాకుండా అన్ని ఇళ్లకు వెళ్లేది. ఇంటికి రాజు వస్తే ఆ కుటుంబీకులు దానికి స్నానం చేయించి కడుపునిండా అన్నం పెట్టేవారు. రాత్రి వేళల్లో గ్రామానికి కొత్త వ్యక్తులు వచ్చేందుకు భయపడేవారు. గ్రామస్థులందరికీ అదంటే అభిమానం. యువకులు రెండు వారాలకు ఒకసారి పశువైద్య సిబ్బందితో రాజుకు చికిత్స చేయించేవారు.

సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం సర్పంచి నర్సింహారెడ్డి ఇంటి సమీపంలోకి అస్వస్థతతో రాజు రావడంతో ఎవరైనా విషప్రయోగం చేశారేమోనని అనుమానించారు. దీంతో ఆయన హవేలిఘణపూర్‌ పశువైద్య సహాయకుడు సలావుద్దీన్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చి దానికి వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆ కుక్క మృతి వార్త తెలిసి గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొందరు కంటతడి పెట్టారు. విశ్వాసంతో మెదిలిన రాజుకు అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్థులు నిర్ణయించారు. అందుకు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చారు. దానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మృతదేహానికి స్నానం చేయించి దానిపై నూతన వస్త్రం కప్పి పాడెపై ఉంచారు. గ్రామస్థులు పాడెను మోశారు. దాని సేవలు గుర్తు చేసుకుంటూ సుమారు రెండు గంటల పాటు అంతిమయాత్ర నిర్వహించారు. శ్మశానవాటికలో దాన్ని ఖననం చేశారు. నిజమైన ప్రేమకు, ఆదరణకు ఇది నిలువెత్తు తార్కాణం .

ఇండియాను ఓడిస్తే నగ్నంగా డాన్సు చేస్తా..

English summary

Villagers have participated in a grand way for the funeral to dog in the village called Lignsan Palli in Medak District.The dog name was raju and this dog was very famous in that village.Soo many villagers were cried because of the death of this dog.