సెల్‌ ఫోన్ పగులగొట్టిందన్న కోపంతో.. బామ్మను చంపిన ఘనుడు

A grand son kills his grand mother

09:47 AM ON 27th April, 2016 By Mirchi Vilas

A grand son kills his grand mother

క్షణికావేశం ఆలోచన చంపేస్తుంది. ప్రాణాల మీదకు తెచ్చే చర్యలకు పురికొల్పుతుంది. తాజాగా సెల్ ఫోన్ పగులగొట్టిందన్న కోపంతో తన బామ్మను ఓ మనుమడు కర్రతో చావబాదడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 22 ఏళ్ళ శివరాజు సోమవారం సాయంత్రం తన మొబైల్ కు చార్జింగ్ పెట్టాడు. 90 ఏళ్ళ లక్ష్మమ్మ చూసుకోకుండా పొరపాటున దాన్ని తగిలింది. దీంతో సెల్ ఫోన్ కిందపడి పగిలిపోయింది.ఆగ్రహం చెందిన మనుమడు శివరాజ్ కర్రతో ఆమెను చావబాదాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బామ్మ సృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ విషయం తెలిసి మనుమడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శివరాజ్ను పట్టుకుని అరెస్ట్ చేశారు.

English summary

A grand son kills his grand mother