అమెరికాలో 'శివగామి' త్యాగం వింటే కన్నీరు పెట్టాల్సిందే

A great mother saved her child life

03:46 PM ON 29th August, 2016 By Mirchi Vilas

A great mother saved her child life

జక్కన్న సృష్టించిన 'బాహుబలి' ఏ రేంజ్ లో తన సత్తా చాటిందో వేరే చెప్పక్కర్లేదు. అయితే ఆ మూవీలో శివగామి(రమ్యకృష్ణ) పాత్ర గుర్తుందా! అందులో ఆమె నీళ్లలో మునిగిపోతూ కూడా పసివాడిని అలాగే చేతిలో నీళ్లపై తేలేలా పట్టుకున్న సన్నివేశం గుర్తొచ్చిందా! ఇది చూసిన వాళ్ళు అలా జరుగుతుందా ఏమిటి అనుకుని ఉండవచ్చు. కానీ సేమ్ టు సేమ్ కాకపోవచ్చేమో గానీ, ఇంచుమించు అలాంటి సంఘటనే ఇటీవల అమెరికాలో చోటుచేసుకుంది. నీళ్లలో పడిన రెండేళ్ల వయసు కుమారుడిని కాపాడుకునే క్రమంలో ఓ తల్లి తన ప్రాణాలను తృణప్రాయంగా భావించింది.

1/3 Pages

అందుకే తాను మునిగిపోతూ కూడా తన బిడ్డను అలాగే నీళ్లపై తేలే విధంగా ఎత్తిపట్టుకుంది. కన్నబిడ్డను సురక్షితంగా కాపాడుకుని, తాను మాత్రం ప్రాణాలు వదిలేసింది. ఈ దయనీయ సంఘటన ఇటీవల కొలరాడోలో జరిగింది. ఛెల్సీ రస్సెల్(33) తన రెండేళ్ల కుమారుడితో కలిసి పోవెల్ సరస్సులోని ఓ హౌస్ బోట్ లో విహారయాత్రలో భాగంగా కుటుంబంతో సహా విడిది చేసింది. ఈలోగా ఆమె రెండేళ్ల కుమారుడు నీళ్లలో పడిపోయాడు. అంతే! ఆ తల్లి విలవిల లాడిపోయింది. ఏం చేయాలో ఆలోచించే సమయం లేదు. అందుకే వెనకముందాలోచించకుండా ఛెల్సీ నీళ్లలోకి దూకేసింది.

English summary

A great mother saved her child life