వావ్, పాత 5వందల నోటులో కరెంట్ పుట్టించాడు

A Guy From Odisha Produced Electricity From An Old 500 Rupee Note

11:53 AM ON 10th December, 2016 By Mirchi Vilas

A Guy From Odisha Produced Electricity From An Old 500 Rupee Note

రూ 500 , రూ 1000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8 న ప్రకటించాక, రకరకాల నోటు సిత్రాలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. కొందరు చిత్రవిచిత్ర పనులు చేయడం తెల్సిందే. ఇందులో భాగంగా పాత నోట్లకు దండేయడం, రిప్ అని పెట్టడం, పకోడీలు కట్టడం ఇలాంటి చాలా ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. కానీ, ఒడిస్సాకు చెందిన ఓ కుర్రాడు డిఫరెంట్ గా చేసాడు. పైగా సంచలనం కల్గించాడు. అదేమిటంటే, పాతనోట్ల నుంచి కరెంట్ పుట్టించాడు. ఒడిస్సాలోని కొటమల్ గ్రామానికి చెందిన లచ్మన్ దుండి అనే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ స్టూడెంట్ చేసిన ఈ ప్రయత్నం ఓసారి పరిశీలిస్తే,...

అందరిలా ట్రై చేయడం కాకుండా, కొత్తగా చేయాలన్న తపన ఇతన్ని 5వందల నోటు నుంచి కరెంట్ పుట్టించేలా చేసింది. ఆ కరెంట్ తో బల్బును వెలిగించి అందరినీ అబ్బురపరిచాడు. నోటు నుంచి విద్యుత్ ఎలా సాధ్యం అని స్థానికుల్లో అనుమానాలు తలెత్తాయి. అయితే లచ్మన్ దానిపై వివరణ ఇచ్చాడు. 5వందల నోటుపై సూర్యకాంతి కానీ, ఏదైనా వెలుతురు కానీ పడితే దానిపై ఉన్న సిలికాన్ ప్లేట్ వల్ల ఉష్ణం పుడుతుందని, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పాడు. ఈ కుర్రాడి ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధించగలడని చెబుతున్నారు. మరి పాతనోట్లున్న వాళ్ళు కరెంట్ పుట్టిస్తే, ఓ సమస్య తీరినట్లేనని కామెంట్స్ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి: అఖిల్ నిశ్చితార్ధం .. ఇక పెళ్లే తరువాయి ...

ఇవి కూడా చదవండి: నోట్ల రద్దుపై సుప్రీం ప్రశ్నల వర్షం ... కేంద్రం ఉక్కిరిబిక్కిరి

English summary

A Young Guy from Odisha Named Lachman came into news by generating electricity from an old 500 Rupee note which were cancelled by Indian Government.