రైల్లోంచి తోసి.. రేప్ చేసి చెంపేసిన ఒంటి చేతి రాకాసికి శిక్ష వెయ్యరా?

A handicapped brutal man raped a girl

04:35 PM ON 16th September, 2016 By Mirchi Vilas

A handicapped brutal man raped a girl

నేరానికి తగ్గ శిక్ష లేదని ఆవేదన చెందిన ఓ కన్నతల్లి ఆవేదన ఇది. ఒక యువతిని కదిలే రైల్లోంచి తోసేసి అత్యాచారానికి చేసి చంపిన ఒక నేరస్తుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు, కేరళ హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసి ఏడేళ్ళ జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని యువతి తల్లి తీవ్రంగా నిరసించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో తన గుండె బద్ధలైందని, ఆ తీర్పు సమీక్ష కోసం మళ్లీ కోర్టు మెట్లెక్కుతానని చెప్పింది. కేరళలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మృతురాలు సౌమ్య(23) తల్లి సుమతి తీవ్ర ఆవేదన చెందారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఘటన వివరాలను పరిశీలిస్తే...

1/4 Pages

ఎర్నాకుళంలోని ఒక షాపింగ్మాల్ లో పనిచేస్తున్న సౌమ్య 2011వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి ఎర్నాకుళం - షోర్నూర్ ప్యాసింజర్ లేడీస్ కంపార్ట్మెంట్ లో ప్రయాణిస్తుండగా తమిళనాడుకు చెందిన గోవిందసామి అనే వికలాంగుడు(ఒక చేయి మాత్రమే ఉంది) ఆమెపై దాడి చేసి రైల్లోంచి తోసేశాడు. అతను కూడా బయటకు దూకి గాయాలతో పడి ఉన్న సౌమ్యను రైల్వే ట్రాక్ వెంబడి వల్లొతొల్ నగర్ అనే ఊరికి దగ్గర్లో ఉన్న దట్టమైన పొదల్లోకి మోసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.

English summary

A handicapped brutal man raped a girl.