అంబులెన్స్ రాలేదని గర్భిణీ భార్యని 10 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన భర్త!

A husband carried his pregnant wife upto 10 km

02:45 PM ON 21st September, 2016 By Mirchi Vilas

A husband carried his pregnant wife upto 10 km

కట్నం ఎక్కువ తేలేదని, పక్కింటి వాడితో మాట్లాడుతుందని భార్యని చంపేసే భర్తలున్న ఈ రోజుల్లో, భార్యని కన్నతల్లిలా చూసుకుంటున్న ఒక భర్త వెలుగులోకి వచ్చాడు. తాళి కట్టిన భార్య అనారోగ్యంతో అర్థాంతరంగా కన్ను మూయడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక, భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచాడో భర్త. ఈ హృదయ విదారక ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... నిండు గర్భిణియైన భార్యను భుజాన వేసుకుని నడుస్తూ ఒడిశాలోని రాయగఢ్ జిల్లా కొసొహరిఖొల్లా గ్రామానికి చెందిన సొంబారు అనే వ్యక్తి తాజాగా వార్తల్లోకెక్కారు.

గర్భవతి అయిన తన భార్య అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించడం కోసం 108లకు ఫోన్ చేశాడు. ఎంత సేపటికి అంబులెన్సు రాకపోవడంతో... భార్య దీనస్థితిని చూడలేక ఆమెను భుజాన వేసుకుని ఆసుపత్రికి నడక సాగించాడు. సుమారు 10 కిలోమీటర్లు దూరం ఇలా నడిచిన తర్వాత అంబులెన్స్ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో మరోసారి ఒడిశా ప్రభుత్వ ఘనత పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: మూడు నెలల ముందే భూమ్మీద పడ్డ 'మిరాకిల్'

ఇది కూడా చదవండి: ఇటువంటి రాక్షస ప్రేమను మీరెక్కడా చూసుండరు.. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదని..

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఇంటర్నెట్ కావాలంటే మీ ఫోన్ లో ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోండి

English summary

A husband carried his pregnant wife upto 10 km. A husband called ambulance to take his wife to hospital. But the ambulance was not come. That's why he carried his pregnant wife on shoulders.