భార్య కోసం ఆడ వేషంలో వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు

A husband goes in lady dress to see his wife

10:41 AM ON 12th July, 2016 By Mirchi Vilas

A husband goes in lady dress to see his wife

లోకంలో ఒక్కక్కరిదీ ఒక్కో తీరు. పెళ్లయిన దంపతులను కట్నం కోసమో, మరో కారణంతోనో ఎడంగా పెడితే వాళ్ళు తట్టుకోలేరు. సరిగ్గా ఇలాగే తన భార్య ఎడబాటును తట్టుకోలేక ఆమెను కలిసేందుకు ఆడ వేషంలో వెళ్ళిన ఓ భర్త వెళ్ళాడు. అయితే, అతనికి ఊహించని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన శేఖర్ కు రెండేళ్ళ కిందట ఇంద్రాతో పెళ్ళయ్యింది. ఇటీవల సింగపూర్ లో మంచి ఉద్యోగాన్ని వదులుకుని భారత్ కు తిరిగివచ్చాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్త, తన కుమార్తెను రెండు నెలలుగా భర్తకు దూరంగా పెట్టి, తన వద్దనే ఉంచుకుంది.

పాపం, భార్య ఎడబాటును భరించలేని శేఖర్ ఎలాగైనా ఆమెను కలవాలని అనుకున్నాడు. దీని కోసం ఓ ప్లాన్ వేశాడు. అత్త కంట పడకుండా ఉండేందుకు ఆడవేషంలో అక్కడికి వెళ్ళాడు. భార్యను బయటకు రప్పించి ఆమెతో మాట్లాడాడు. అయితే ఆడ వేషంలో ఉన్న అతడు మగవారి చెప్పులు ధరించి వెళ్లడం అతని కొంప ముంచింది. మగవారి చెప్పులు ధరించి ఉండడం చూసిన స్థానికులు, అతగాడిని పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిగా అనుమానించి పోలీసులకు పట్టించారు. తీరా అంతా అసలు విషయం తెలుసుకుని ఒకటే నవ్వులు. అదండీ సంగతి.

English summary

A husband goes in lady dress to see his wife