భార్య పెట్టే టార్చర్ భరించలేక ఏ భర్త చెయ్యని పని చేశాడు!

A husband gone to jail to not bear wife torture

04:39 PM ON 9th September, 2016 By Mirchi Vilas

A husband gone to jail to not bear wife torture

ఇంట్లో భార్య పెట్టే పోరు భరించలేక ఆమెకు, ఇంటికి దూరంగా ఉండాలనుకున్న ఓ వ్యక్తి బ్యాంకు దోపిడీకి యత్నించి కావాలని జైలు పాలైన ఘటన అమెరికా దేశంలో సంచలనం రేపింది. అమెరికాలోని కన్సాస్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల లారెన్స్ రిప్పల్ కు తన భార్య రిమీడైస్ తో ఘర్షణ జరిగింది. ప్రతిరోజూ ఇంట్లో భార్య పెట్టే పోరు భరించలేక ఏదైనా నేరం చేసి భార్యకు దూరంగా జైలులో గడపాలని నిర్ణయించుకున్నాడు. అంతే లారెన్స్ కన్సాస్ సిటీ బ్యాంకు క్యాషియర్ వద్దకు వెళ్లి అక్కడ తుపాకీ చూపించి 3000 డాలర్లు ఇవ్వాలంటూ బెధిరించాడు. బ్యాంకు క్యాషియర్ డబ్బు ఇచ్చినా లారెన్స్ పారిపోకుండా పోలీసులు వచ్చే దాకా ఉండి అరెస్టయ్యాడు.

ఆపై కోర్టు ఉత్తర్వులతో లారెన్స్ కావాలని జైలుకు వెళ్లాడు. భార్యతో విడిగా ఉండటమో కాని విడాకులు ఇవ్వడమో చేయవచ్చు కాని తాను జైలుకు వెళ్లడానికి మొగ్గు చూపానంటాడు లారెన్స్. తనకు జైలు సెల్ లో తోటి ఖైదీలతో స్నేహంగా ఉంటూ మంచి భోజనంతో పాటు వైద్య సౌకర్యాలు అందుతున్నాయంటున్నారాయన. మొత్తం మీద భార్య పోరు పడలేక జైలుకు వచ్చిన లారెన్స్ మాత్రం ఇంటి కంటే కూడా జైలు పదిలమని చెప్పడం కొసమెరుపు.

ఇది కూడా చదవండి: ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం.. తేడా వస్తే భూగోళానికి భారీ ప్రమాదం!

ఇది కూడా చదవండి: ఇప్పటి జనరేషన్ లో ప్రతీ ఒక్కరు చేసే 15 తప్పులు!

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

English summary

A husband gone to jail to not bear wife torture. Lawrence Ripple gone to jail for not to control wife harassment.