11 ఏళ్లుగా భార్య శవంతో కాపురం

A husband sleeps with his wife dead body from 11 years

01:03 PM ON 7th July, 2016 By Mirchi Vilas

A husband sleeps with his wife dead body from 11 years

అవునా, అవుననే అంటున్నారు.అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు. నిజమైన ప్రేమ ఇద్దరి మధ్య ఏర్పడితే... అది స్వచ్చమైనదైతే, ఆ ప్రేమను మరణం కూడా విడదీయలేదని అంటారు. చరిత్రలో ఎన్నో ఫలించిన ప్రేమ కథలు, విఫలమైన ప్రేమ కథలు చాలానే వున్నాయి. రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి ఇలా ఎన్నో ప్రేమ జంటలు ఇప్పటికీ ప్రేమకు సజీవ సాక్షాలు. ఇక ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా వర్ధిల్లుతున్న తాజ్ మహల్ కూడా ప్రేమకు ప్రతిరూపమే. కాగా ఒక భర్త తన భార్త మారణించగా ఆ భార్య శవంతో దాదాపు 11 సంవత్సరాల నుంచి గడిపేస్తున్నాడు.

దీంతో ఆయన భార్యపై చూపిస్తున్న ప్రేమ భయకంపితుల్ని చేస్తుంది.. అదే సమయంలో ఆయన ప్రేమ ఎంత గొప్పది.. అలాంటి భర్త ప్రేమను పొందిన భార్య ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వియత్నాంలో క్వాంగ్ నాం ప్రావిన్స్ వద్ద ఓ వ్యక్తి(55) భార్య మరణించింది. మనిషికి జనన మరణాలు సహజం.. భర్త తన భార్య తనని విడిచి అర్ధాంతరంగా వెళ్ళిపోయిందని ఏడ్చాడు. తన భార్యతో పాటు తాను మరణించలేక ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె సమాధి వద్ద 20 నెలలు కాలం గడిపాడు. సమాధి వద్ద ఉన్నప్పుడు గాలి, వాన వస్తున్నాయని భావించి ఆ భర్త ఓ ఆలోచన చేశాడు.

దీంతో 2004 సంవత్సరంలో తన భార్య సమాధిని తవ్వి ఆమె హస్తికలను, మట్టిలో కలవకుండా, మిగిలిన శరీర భాగాన్ని బయటికి తీసి వాటిని కాగితం, మట్టిని ఉపయోగించి మనిషి శరీరంలా తయారు చేశాడు. ఆ శరీరానికి ముఖంగా ఓ మాస్క్ ను తగిలించాడు. అంతటి ఊరుకోలేదు. ఆమె శరీరానికి డ్రెస్ కూడా వేశాడు. ఆ శరీరాన్ని తన ఇంటిలో పెట్టుకొని భార్య పక్కన నిద్రపోవడం ప్రారంభించాడు. తండ్రి పక్కనే కొడుకు కూడా గత 11 సంవత్సరాలుగా ఆ శరీరం పక్కనే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరలెవెల్లో కామెంట్స్ పడుతున్నాయి.

English summary

A husband sleeps with his wife dead body from 11 years