బెట్టింగ్ లో ఓడిపోయాడని భార్యను తాకట్టు పెట్టేసాడు! ఆమె ఏం చేసిందో తెలుసా?

A husband sold his wife for losing bet in match

11:42 AM ON 30th May, 2016 By Mirchi Vilas

A husband sold his wife for losing bet in match

ఐపీఎల్ బెట్టింగ్ లో ఓడిపోయాడని ఒక కలియుగ ధర్మరాజు తన భార్యనే తాకట్టు పెట్టేసాడు. ఈ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే... యూపీలోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. గోవింద్ నగర్ లో ఉంటున్న ఓ వ్యక్తి నిత్యం ఐపీఎల్ బెట్టింగులు వేస్తూ తన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నాడు. ఇంత జరిగినప్పటికీ అతడికి జూదం పై మోజు తీరక ఏకంగా తన భార్యను పణంగా పెట్టి బెట్టింగ్ కాసి ఓడిపోయాడు. దీంతో ఈ కలియుగ ధర్మరాజు కారణంగా ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. బెట్టింగ్ లో నీ భర్త నిన్ను పందెం కాసి ఓడిపోయాడు, మా కోరిక తీర్చు అంటూ ఫోన్ లో వేధింపులు మొదలు పెట్టారు.

ఇంక వారి వేధింపులు భరించలేక ఆ మహిళ స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పాటు తన భర్త తరుచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆ కలియుగ ధర్మరాజు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తనను వేధిస్తున్న బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే భర్త అన్న అహంకారంతో తన భార్యను ఏమైనా చేయవచ్చని అనుకుంటే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నారు మహిళా సంఘాల నేతలు.

English summary

A husband sold his wife for losing bet in match