గుండెల్ని పిండేసే ఘటన: భార్య శవంతో 60 కి.మీ. నడిచిన భర్త!

A husband walks with his wife dead body upto 60 kms

11:20 AM ON 7th November, 2016 By Mirchi Vilas

A husband walks with his wife dead body upto 60 kms

కష్టాలు అందరికీ వస్తాయి. కొన్ని కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకోవడం వింటుంటాం. ఇక ఆ మధ్య ఒడిశాలో భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కి.మీ. నడిచిన భర్త ఉదంతం తెల్సిందే. అయితే ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణాలో చోటు చేసుకుంది. తన భార్య శవాన్ని ఓ చిన్న తోపుడు బండిపై ఉంచి దాన్ని తోసుకుంటూ 60 కిలోమీటర్లు నడిచాడో భర్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

సంగారెడ్డి జిల్లా మానూరు మండలం మయికోడ్ కు చెందిన రాములుకు కుష్టు వ్యాధి సోకడంతో ఆరేళ్ళ క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. అదే వ్యాధితో బాధపడుతున్న 46 ఏళ్ళ కవిత ఇతనికి తారసపడింది. ఇద్దరూ సుమారు రెండేళ్ళు పని చేసుకుని జీవించారు. అయితే అనారోగ్యంతో కవిత ఈ నెల 4న మరణించింది.

English summary

A husband walks with his wife dead body upto 60 kms