కోర్ట్ విచారణకు ఓ ఇండియన్ 2ఏళ్లుగా దుబాయ్ లో ఎన్ని కిమీ. నడిచాడో తెలుసా?

A indian facing court problem in Dubai

01:21 PM ON 1st December, 2016 By Mirchi Vilas

A indian facing court problem in Dubai

పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా బాబు అన్నట్టుగా వుంది ఈ ఘటన. అతడు పడుతున్న రణకయాతన అంతా ఇంతా కాదు. 15 రోజులకోసారి విచారణ నిమిత్తం కోర్ట్ కు హాజరవ్వాలి. నేనుండేది దుబాయ్ లోని సోనాపూర్, వెళ్లాల్సింది కరామా, రెండింటికి మధ్య దూరం 22 కిలోమీటర్లు బస్ లో వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే గత రెండేళ్లుగా, పోనూ 22 కిలో మీటర్లు, రాను 22 కిలో మీటర్లు కాలినడకన వెళుతున్నా. దీని కోసం ఉదయం 4 గంటలకే నా నడక స్టార్ట్ చేస్తాను. కోర్ట్ సమయానికి ముందే నేనక్కడుంటా. ఎండాకాలంల, ఇసుక తుఫాన్లకు, ఎండవేడిమికి, ఉక్కపోతకు కూడా తట్టుకుంటూ, నడుచుకుంటూ కోర్ట్ కు వెళ్లేవాడిని. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోయేవాడిని, దయచేసి నా గోడును అర్థం చేసుకోండి, నన్ను మా దేశానికి పంపించండి. ప్రస్తుతానికి నేనొక పార్క్ లో తలదాచుకుంటున్నా అని వివరించుకొస్తున్నాడు. ఇంతకీ ఎవరంటారా?

1/3 Pages

ఇది దుబాయ్ కి బతుకుదెరువు కోసం వెళ్లిన సెల్వరాజ్ దీనగాథ. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాలకు తల్లి చనిపోవడంతో తల్లి అంత్యక్రియలకు సొంతూరికి వెళ్లాలని అక్కడి కంపెనీ వాళ్లకు చెప్పాడు.

English summary

A indian facing court problem in Dubai