సింగపూర్ లో నకిలీ నోట్లు ప్రింట్ చేస్తూ దొరికేసిన ఇండియన్.. ఆపై ఏమైందంటే..

A Indian printing fake currency in Singapore

12:05 PM ON 26th November, 2016 By Mirchi Vilas

A Indian printing fake currency in Singapore

నకిలీ నోట్ల బెడద ఎంతుందో చెప్పనలవి కాదు. అందుకే ఇండియాలో రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసారు. కొత్త నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం, రూ. 500 కొత్త నోట్లు రాకపోవడం వంటి కారణాల వలన జనానికి చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఇక ఎంతో గొప్పగా చెప్పుకునే సింగపూర్ లో నకిలీ కరెన్సీ బెడద వుంది. తాజాగా సింగపూర్ కరెన్సీకి నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న 29 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న శశికుమార్ లక్ష్మణ్ సింగపూర్ డాలర్లు 100, 50 నోట్లను ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు డిప్యూటీ పబ్లిక్ ప్రాసెక్యూటర్ మగ్డాలెన్ హాంగ్ తెలిపారు.

1/3 Pages

100 డాలర్ల నోటును జిరాక్స్ తీసి చూశాడు. అది అచ్చం అసలైన నోటును పోలి ఉండడంతో నకిలీ నోట్లు ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా మూడు నోట్లను ముద్రించి వాటిని పరీక్షించాలనుకున్నాడు.

English summary

A Indian printing fake currency in Singapore