వదిన నగ్న ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టిన సింగర్.. ఆపై..

A Kerala singer puts his sister in law photos in facebook

05:46 PM ON 1st August, 2016 By Mirchi Vilas

A Kerala singer puts his sister in law photos in facebook

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. రోజురోజుకి ఫేస్ బుక్ ద్వారా జరిగే నేరాల సంఖ్య పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఫేస్ బుక్ లో నగ్న ఫోటోలు పోస్ట్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ ద్వారా వదినమ్మ నగ్న చిత్రాలను ఓ సింగర్ ఫేస్ బుక్ లో పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి నగరానికి చెందిన జె. నవీన్ అనే సింగర్ ఓ ఫేక్ అకౌంట్ ద్వారా తన వదిన నగ్న ఫోటోలను పోస్ట్ చేశాడు. దీనిపై పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 67(ఎ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గాయకుడు నవీన్.. రాణి పీరవోమ్ పేరిట ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి తనతోపాటు మరో అయిదుగురి ఫోటోలను అమర్యాదకరమైన హెడ్డింగ్ తో పోస్టు చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇంకా తాను నడిపే చాక్లెట్ తయారీ కంపెనీ బిజినెస్ పేజీలోనూ ఆ ఫోటోలు ఉంచాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ఫేస్ బుక్ ఐపీ అడ్రస్ సాయంతో దర్యాప్తు చేస్తున్నామని సైబర్ సెల్ సర్కిల్ ఇన్ స్పెక్టరు పీకే శివన్ కుట్టీ చెప్పారు. కాగా బాధితురాలి సోదరిని నవీన్ జులై 12వ తేదీన వివాహం చేసుకున్నాడని.. వివాదాలతో విడిపోయిన కారణంగా వదిన ఫోటోలను అలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడని విచారణలో తేలింది.

అంతకుముందు నవీన్ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులపై అతని భార్య కూడా గత ఏడాది ఆగస్టులో ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నవీన్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని కుటుంబ వివాదాల కారణంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని.. తన న్యాయవాది ద్వారా పరువునష్టం కేసు వేస్తానని నవీన్ చెప్తున్నాడు.

English summary

A Kerala singer puts his sister in law photos in facebook