ఓ బిచ్చగత్తెకు రూ. 500 నోటిస్తే ఏం చేసిందో తెలుసా(వీడియో)

A lady beggar rejected rupees 500 note

01:19 PM ON 14th November, 2016 By Mirchi Vilas

A lady beggar rejected rupees 500 note

రోజులు ఎలా ఉన్నాయో, ఎంత మారిపోయాయి అంటూ పలువురు తరచూ అంటుంటారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో చోటుచేసుకుంటున్న విచిత్రాల్లో ఇది మరీ విడ్డూరంగా వుంది. ఓ బిచ్చగత్తెకు బిచ్చం వేస్తే, తిరస్కరిస్తూ వెళ్లిపోయిన తీరు ఆశ్చర్యం కల్గిస్తోంది. పెద్ద నోట్లు విలువ ఎంతగా పడిపోయిందో చెప్పే ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు దేశంలో వంద నోటున్నేడే గొప్పోడు. దేశాన్ని ఏలిన పెద్ద నోట్లుగా చలామణి అయ్యాయి. అయితే ప్రధాని మోడీ ఒకే ఒక్క ప్రకటనతో మొత్తం శీను మారిపోయింది. రూ.1000, రూ.500 నోట్లు జేబులో నిండుగా ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

జేబులో వంద నోటు కనిపిస్తే మాత్రం బస్ కండెక్టరు నుంచి పెట్రోలు బంకు వాడి వరకు అందరూ జేజేలు కొడుతున్నారు. బిక్షమడుగుతూ దగ్గరకు వచ్చిన ఓ బిచ్చగత్తెకు రూ. 500 నోటిస్తే ఛీ కొడుతూ వెళ్లిపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో పై మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

A lady beggar rejected rupees 500 note