ఉద్యోగం ఇప్పిస్తానని అతడి భార్యని అమ్మేసిన లేడీ బ్రోకర్.. ఆపై సౌదీకి తీసుకుపోయి..

A lady broker sold his wife for money

11:50 AM ON 16th November, 2016 By Mirchi Vilas

A lady broker sold his wife for money

ఇది వింటేనే అందరిలో ఓ రకమైన ఆందోళన వస్తుంది. కానీ ఇది నిజం. నాకు నరకం చూపిస్తున్నారు. చెప్పులతో కొడుతున్నారు. చెప్పుకోలేని పని చేయమంటున్నారు. ఇక నాకు చావే శరణ్యం అంటూ సౌదీ నుంచి షహనాజ్ తన భర్త జాకీర్ హుస్సేన్ కు రెండ్రోజుల ముందు ఫోన్ చేసి రోధించింది. దీంతో నా భార్య సౌదీలో చిత్రహింసలు పడుతోంది. ఉద్యోగం తీసిస్తామని బ్రోకర్లు నా భార్యను అమ్మేశారు. ఆమెను ఎలాగైనా మనదేశానికి రప్పించండి జాకీర్ హుస్సేన్ - తిరుపతి అర్బన్ ఎస్పీని తన పిల్లలతో సహా కలిసి మొరపెట్టుకున్నాడు. సౌదీకి వెళ్లిన తర్వాత చిన్న చిన్న కష్టాలుంటాయి. సర్దుకుపోతుండాలి.

అగ్రిమెంట్ అయిన తర్వాత తిరిగి వచ్చేస్తుంది షహనాజ్ కుటుంబ సభ్యులకు బ్రోకర్ షబానా బేగం తరచూ చెబుతోందట. అసలు దీనివెనుక వున్న మిస్టరీలోకి వెళ్తే...

1/6 Pages

రేణిగుంట బుగ్గ వీధిలో ఎస్.పి.జాకీర్ హుస్సేన్, షహనాజ్(39) నివాసం ఉండేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ లో హాకర్ వ్యాపారం చేసుకునే జాకీర్ కు ఏడాది కిందట పక్షవాతం వచ్చింది. ఓ కుమార్తెకు చర్మవ్యాధి సోకింది. దీంతో ఆ కుటుంబం కష్టాల పాలైంది. కొన్ని రోజుల తర్వాత జాకీర్ స్వల్పంగా కోలుకుని మళ్లీ రైల్వే స్టేషన్లో వ్యాపారం చేస్తున్నాడు. ఎంత కష్టపడ్డా ఇద్దరికీ మందుల ఖర్చుకు కూడా రావడంలేదు.

English summary

A lady broker sold his wife for money