చదివింది ఇంటర్.. చేసే జాబ్ అకౌంటంట్.. 16 కోట్లు నొక్కేసింది.. ఎలా?

A lady cheated her boss and robbed 16 crores from the company accounts

05:22 PM ON 4th July, 2016 By Mirchi Vilas

A lady cheated her boss and robbed 16 crores from the company accounts

ఆ యువతి చదివింది ఇంటర్, కానీ చేసే వృత్తి అకౌంటంట్, అకౌంటింగ్ నేర్చుకోకుండా అకౌంటెంట్ గా జాబ్ లో చేరింది. చేరిన కంపెనీలో అందరినీ వలలో వేసుకుంది. చివరికి బాస్ ను బకరా చేసి 16 కోట్లు నొక్కేసింది. ఎలాగో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 29 ఏళ్ల వృశాలి బమానే ఓ కంపెనీలో ఏడు సంవత్సరాల నుండి అకౌంటెంట్ గా పని చేస్తుంది. పధకం ప్రకారం ముందుగా తన కొలీగ్స్ ని ఎంతో తెలివిగా బుట్టలో వేసుకుంది. ఆ తరువాత ఎంతో చాకచక్యంగా కంపెనీ బ్యాంకు అకౌంట్ల నుంచి 16.32 కోట్ల రూపాయలను తన భర్త, తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేసింది.

అక్కడితో ఆగకుండా తెలివిగా కొట్టేసిన కోట్ల రూపాయలను ఆస్తులుగా మార్చుకుంది. దోచేసిన డబ్బుతో విలాసవంతంగా తన జీవితాన్ని మార్చుకుంది. ఎంతో విలాసవంతమైన బంగ్లాను కట్టించుకుంది. ఐదు లగ్జరీ అపార్ట్ మెంట్లను, నాలుగు ఫ్యాన్సీ కార్లను కొనుగోలు చేసింది. అంతేకాదు తన ఆడంబరాన్నిఅందరికీ తెలియజేయడానికి ఖరీదైన కార్లు, బైకులను బహుమతులుగా ఇచ్చేది. దోచిన మొత్తంలో సగానికి సగం ఇంటీరియర్ డిజైన్ కోసం ఖర్చు చేసింది. తన వాహనాలకన్నింటికి తన లక్కీ నెంబర్. 3777ను వివిధ ఆర్టీఓ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేసుకుంది.

అయితే ఆమె గుట్టును పోలీసులు ఎంతో తెలివిగా బయట పెట్టారు. బాస్ అకౌంట్లో నుంచి కొట్టేసిన కోట్ల రూపాయలతో చాలా తెలివిగా పెట్టుబడుల వైపు తరలించిందని ముంబై పోలీసులు వెల్లడించారు. దోచేసిన డబ్బంతా తన బ్యాంక్ అకౌంట్స్ లేకుండా వేరెక్కడైనా దాచేసి ఉంటుందని పోలీసులు మొదట భావించారు.. కానీ, ఆ డబ్బును ఆస్తుల కొనడానికి ఉపయోగించడం చూసి చాలా షాక్ కు గురయ్యాయని ఆజాద్ మైదాన్ పోలీసులు తెలిపారు. వృషాలి బమానేకు చెందిన ఎనిమిది బ్యాంక్ అకౌంట్లను గుర్తించామని, వాటిలో ఏ అకౌంట్ లోనూ ఆ డబ్బుని దాచలేదని, ఎప్పటికప్పుడూ ఆ డబ్బుని ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసిందని డీసీపీ మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.

కేరళ, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు కుటుంబసభ్యులతో హెలికాప్టర్లో షికార్లు కొట్టిందని, విదేశీ టూర్ల కోసం వీసా కూడా దరఖాస్తు చేసుకుందని పోలీసులు తెలిపారు. బమానే, ఆమె భర్త సచిన్ విలాసవంతమైన ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు చేసేవారని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో బమానేపై ఐపీసీ సెక్షన్ 408 కింద కేసు బుక్ చేశామన్నారు. ఆమెకు సంబంధించిన ఆస్తులను పోలీసులు సీజ్ చేయనున్నారు.

English summary

A lady cheated her boss and robbed 16 crores from the company accounts