ప్రియుడి కోసం మొగుడ్ని లేపేయాలనుకున్న లేడీ టెక్కీ.. ఆపై ఏం జరిగిందంటే..

A lady techie planned to kill her husband

12:15 PM ON 9th November, 2016 By Mirchi Vilas

A lady techie planned to kill her husband

చంపడానికి చావడానికి ఎవరూ వెనుకాడని రోజులు దాపురించాయి. విచక్షణ కోల్పోయి చేస్తున్న పనులు భయం కల్గిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని వెల్లూరులో దారుణం జరిగింది. మాజీ ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. అది కూడా తన చేతులకు మట్టంటకుండా. దీని కోసం పెద్ద ప్లానే వేసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆ మహిళ భర్తకు గిఫ్ట్ గా విస్కీ బాటిల్ ఇచ్చింది. తన భార్య ప్రేమగా ఇచ్చింది కదా అని అమాయకంగా తాగేశాడు భర్త. కానీ అందులో విషం కలిపిందన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు.

ఆ విస్కీ తాగిన భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్లాన్ కు కర్త, కర్మ, క్రియ ఆమె మాజీ ప్రియుడే. అక్టోబర్ 29న జరిగిన ఈ ఘటన వెనకున్న మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించారు. వైద్యులు చేసిన పరీక్షల్లో తాగిన విస్కీలో విషం కలిసినట్లు తేలింది. దీంతో కూపీ లాగితే, అసలు విషయం బయట పడింది.

1/4 Pages

గౌతమి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రియుడిని మర్చిపోయి భర్తతో సుఖంగా గడపలేకపోయింది. ఆమె మాజీ ప్రియుడు వినయగమూర్తి కూడా ఆమెను మర్చిపోలేకపోయాడు. దీంతో ఇద్దరూ మళ్లీ కలిశారు. ఆమె భర్త సతీష్ కుమార్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దీంతో చంపినా తమపై అనుమానం రాకుండా ఉండాలని భావించారు.

English summary

A lady techie planned to kill her husband