లాయర్ పెళ్లికి ఆధార్ శుభలేఖ అయ్యింది

A Lawyer made his Addhar card as invitation card for his marriage

11:11 AM ON 24th January, 2017 By Mirchi Vilas

A Lawyer made his Addhar card as invitation card for his marriage

ఒక్కొక్కరిదీ ఒక్కో వెరైటీ. ఇంట్లో వేడుక ఏదైనా జరిగితే రకరకాల ప్రత్యేకతలు జరగడం సహజం. కానీ ఓ లాయర్ గారు తన పెళ్ళికి వేయించిన వెడ్డింగ్ కార్డు జనాన్ని అబ్బురపరిచాడు. మనిషన్నాక.. కూతంత కళాపోషణ ఉండాలి.. ఓ సినిమాలో రావు గోపాలరావు చెప్పిన ఫేవరెట్ డైలాగ్ .. దాన్ని ఫాలో అయ్యాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ న్యాయవాది. పెళ్లి శుభలేఖ అంటే ఇప్పటి వరకు పుస్తక రూపంలోనే కాకుండా ఎల్సీడీ స్క్రీన్ పై వీడియో రూపంలోనూ రావడం తెల్సిందే. అదే శుఖలేఖను కడియం మండలం బుర్రిలంకకు చెందిన న్యాయవాది కొత్తపల్లి మూర్తి వెరైటీగా ముద్రించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఫిబ్రవరి ఒకటిన జరిగే తన పెళ్లి శుభలేఖను రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆధార్ కార్డు రూపంలో ముద్రించాడు. మూర్తి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లి కార్డులు ఇస్తుంటే అందరూ ముందు ఆధార్ కార్డు ఇస్తున్నారేంటి? అని అనుకున్నా ఆతర్వాత, విషయం తెలుసుకుని భలేగుంది అని మెచ్చుకుంటున్నారు.

ఇది కూడా చూడండి : ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఇలాంటి ఫోనే లేదట

ఇది కూడా చూడండి : మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో కోట్లాదిమందిలో ఆందోళన

English summary

A different thought in his mind.A Lawyer made his Addhar card as invitation card for his marriage. Every shocked with his fun thinking